ఈటల రాజేందర్ ధిక్కార స్వరం: వేచి చూసే ధోరణిలో కేసీఆర్

By telugu team  |  First Published Aug 31, 2019, 12:38 PM IST

ఈటల రాజేందర్ ధిక్కార స్వరంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేచి చూసే ధోరణిని అవలంబించాలని ఆయన అనుకుంటున్నారు.


హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఇప్పటికిప్పుడు స్పందించకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు భావిస్తున్నారు. వేచి చూసే ధోరణిని ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి తనకు భిక్ష కాదని, గులాబీ ఓనర్లం తామేనని ఈటల రాజేందర్ ఇటీవల వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. 

వెనకబడిన తరగతులు, సోషల్ మీడియా ఎలా స్పందిస్తున్నాయనే విషయంపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ప్రతిస్పందనలు పరిశీలించి తాను స్పందించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈటల రాజేందర్ వ్య.వహారంపై ఆయన తన సన్నిహితులతో మాట్లాడారు. 

Latest Videos

undefined

ఈటల రాజేందర్ వ్యవహారాన్ని తాను చూసుకుంటానని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానానికి గురిపెట్టి ఈటల రాజేందర్ తన వాగ్బాణాలను విసిరినప్పటికీ సంయమనం పాటించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. 

ఈటల రాజేందర్ ను శుక్రవారం బీసీ సంఘాల నాయకులను కలిసిన విషయం తెలిసిందే. ఆయనకు వారు పూర్తి మద్దతు ప్రకటించారు. కాగా, కాంగ్రెసు, బిజెపి నేతలు కూడా ఈటలకు మద్దతు పలుకుతున్నారు. 

ఈటల తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం తన దృష్టికి రావడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అదే రోజు ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలా మాట్లాడడానికి గల కారణాలేమిటని కేటీఆర్ ఈటలను ప్రశ్నించినట్లు సమాచారం. ఇరువురి మధ్య సంభాషణల తర్వాత తన మాటలను మీడియా వక్రీకరించిందని ఈటల ఓ ప్రకటన విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్

ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?

click me!