ఐపిఎస్ అధికారుల భార్యలు..: రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు

Published : Aug 31, 2019, 12:16 PM IST
ఐపిఎస్ అధికారుల భార్యలు..: రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఐపిఎస్ అధికారులపై రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపిఎస్ అధికారుల భార్యలు ప్రభుత్వ వాహనాలను వాడుతున్నారని, తనను ఐపిఎస్ అధికారి శివకుమార్ వేధించారని భూమయ్య ఆరోపించారు. 

కరీంనగర్: పోలీసు శాఖ తీరుపై రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపిఎస్ అధికారుల భార్యలు ప్రభుత్వ వాహనాలను వాడుతున్నారని, ప్రజా ధనాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

పోలీసు శాఖలో నిజాయితీగా పనిచేసినందుకే తనపై అక్రమంగా ఎసిబీ కేసు నమోదు చేశారని ఆయన శనివారం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అధికారులను నిలదీస్తే జమ్మికుంట నుంచి పోస్టింగ్ తీసేశారని ఆయన చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిస్తే తనకు హుస్నాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారని ఆయన చెప్పారు. తనను ఐపిఎస్ అధికారి శివకుమార్ వేధించారని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్ పోలీసు స్టేషన్ లో అదృశ్యమైన రెండు తుపాకులు ఏమయ్యాయని ఆయన అడిగారు.

హుస్నాబాద్ పోలీసులు స్టేషన్ లోని ఎకె 47, 0ఎంఎం కార్బన్ తుపాకులు ఏమయ్యాయని, ఆ సంఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా