వెనక్కి: కేడర్ బదిలీకి కేంద్రం నో, తెలంగాణలోనే స్టీఫెన్

By narsimha lodeFirst Published Sep 4, 2019, 7:44 AM IST
Highlights

కేడర్ మార్పుకు కేంద్రం అంగీకరించకపోవడంతో స్టీఫెన్ రవీంద్ర మళ్లీ వెనక్కివచ్చారు. తెలంగాణలోనే ఆయన విధులు నిర్వహించనున్నారు. 

హైదరాబాద్: ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కేడర్ మార్పుకు కేంద్రం అంగీకరించలేదు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. కేడర్ మార్పు కోసం స్టీఫెన్ రవీంద్ర డీవోపీటీని కోరాడు. కానీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు.

ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఇంటలిజెన్స్ అధికారిగా నియమించాలని భావించాడు.ఈ మేరకు తెలంగాణ కేడర్ లో ఉన్న స్టీఫెన్ రవీంద్రను ఏపీ కేడర్ కు మార్చాలని కేంద్రాన్ని కోరాడు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ ఈ విషయంలో సానుకూలంగా స్పందించాడు.అయితే స్టీఫెన్ రవీంద్ర కేడర్ మార్పు కోసం డీఓపీటీ నుండి ఇంతవరకు సానుకూలంగా స్పందన రాలేదు. 

ఈ ఏడాది మే చివరి వారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమోదం లభించగాననే స్టీఫెన్ రవీంద్ర సెలవుపై వెళ్లాడు. ఏపీలో అనధికారికంగా ఇంటలిజెన్స్ చీఫ్ గా కొనసాగాడు.  త్వరలోనే స్టీఫెన్ రవీంద్రకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావించిన తరుణంలో డీఓపీటీ నుండి వ్యతిరేక నిర్ణయం వెలువడింది.దీంతో స్టీఫెన్ రవీంద్ర మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాడు. 

హైద్రాబాద్ వెస్ట్‌జోన్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర తిరిగి బాధ్యతలను నిర్వహించనున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.తెలంగాణ కేడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ కూడ ఏపీ కేడర్ మారేందుకు డీవోపీటీని కోరింది.

సంబంధిత వార్తలు

స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్: జగన్ కొలువులోకి రేపోమాపో

తెలంగాణ సీఎస్ ను కలిసిన శ్రీలక్ష్మీ, స్టీఫెన్ రవీంద్ర: ఏపీకి డిప్యుటేషన్ పై చర్చ

జగన్ తో మాట్లాడిన ఐఎఎస్ శ్రీలక్ష్మి: తెలంగాణ నుంచి ఎపీకి

గురు శిష్యుల చేతిలో ఏపీ పోలీస్ : ప్రక్షాళనపై జగన్ దృష్టి

ఏపీ ఐబీ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర : లైన్ క్లియర్ చేసిన తెలంగాణ సర్కార్

జగన్ ను కలిసిన స్టీఫెన్ రవీంద్ర: ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆగయా..

ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?

click me!