గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం: వాహనాలు దగ్దం

Published : Sep 04, 2019, 07:33 AM ISTUpdated : Sep 04, 2019, 07:38 AM IST
గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం: వాహనాలు దగ్దం

సారాంశం

మల్కాజిగిరిలో భారీ అగ్నిప్రమాదం సంబంవించింది.ఈ ప్రమాదంలో పలు వాహనాలు దగ్దమయ్యాయి.

హైదరాబాద్: మల్కాజిగిరి విష్ణుపురి కాలనీలోని గణేష్ మంటపంలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో రెండు కార్లు, 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

మల్కాజిగిరి విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అనే అపార్ట్‌మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండలంలో అగ్ని ప్రమాదం సంబంవించింది. ఈ ప్రమాదంలో గణేష్ మండపం పక్కనే ఉన్న కార్లు దగ్దమయ్యాయి. వీటితో పాటు 10 ద్విచక్ర వాహనాలు కూడ అగ్నికి ఆహుతయ్యాయి. 

అపార్ట్‌మెంట్ లో పార్క్ చేసిన ఇతర వాహనాలను స్థానికుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపంతోనే మంటలు వ్యాపించాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!