హైద్రాబాద్ డ్రగ్స్ కేసు:ఆ ఐదుగురి కోసం పోలీసుల దర్యాప్తు

By narsimha lodeFirst Published Jan 11, 2022, 9:57 AM IST
Highlights


హైద్రాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు కీలక విషయాలను సేకరించారు. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిందితుల మొబైల్ ఫోన్ల డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగించారు. డ్రగ్స్ ను హైద్రాబాద్ కు ఎవరెవరు తరలిస్తున్నారనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో  ఇటీవల కాలంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ కొందరు పట్టుబట్టారు. అయితే Telangana రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. హైద్రాబాద్ లో drugs  సరఫరా చేసే వారిపై నిఘా పెట్టామని Hyderabad CPగా బాధ్యతలు చేపట్టిన సీవీ Anand చెప్పారు. 

డ్రగ్స్ సరఫరాలో ఎవరెవరు భాగస్వామ్యులుగా ఉన్నారు, డ్రగ్స్ ఎక్కడెక్కడి నుండి వస్తున్నాయనే  విషయమై పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.  Goa , Mumbaiనగరాల్లో  ఉన్న డ్రగ్స్ మాఫియా చక్రం తిప్పుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సికింద్రాబాద్, పాతబస్తీ, జీడిమెట్ల, కూకట్‌పల్లి, గోల్కోండల్లోడ్రగ్స్ మాఫియా మకాం వేసినట్టుగా పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించారు.  అయితే వీరికి ఎక్కడెక్కడి నుండి డ్రగ్స్ అందుతున్నాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ  విచారణలో పోలీసులు కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించారు. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల నుండి కూడ డ్రగ్స్ సరఫరా చేసే వారితో నిందితులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

సముద్ర మార్గం ద్వారా గోవా, ముంబైలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల నుండి హైద్రాబాద్ కు మాదక ద్రవ్యాలు చేరుతున్నాయి. గోవా, ముంబై నుండి హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు ఉన్నారని పోలీసులు గుర్తించారు. అయితే వీరు మారు పేర్లతో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు  తెలిపారు. మారు పేర్లతో దందా నిర్వహించే వారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారని కూడా పోలీసులు గుర్తించారు..

హైద్రాబాద్ లో చదువుకోసం వచ్చిన నైజీరియన్లు డ్రగ్స్ ను సేకరించి హైద్రాబాద్ లో సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో గోవా, ముంబై నుండి డ్రగ్స్ ను హైద్రాబాద్ కు తరలిస్తున్నారని పోలీసులు  తమ దర్యాప్తులో గుర్తించారు. 

ఇటీవల కాలంలో పోలీసులకు చిక్కిన డ్రగ్స్ సరఫరా దారుల నుండి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. నిందితులు ఉపయోగించిన Mobile డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా కోసం మైనర్లను కూడా నిందితుల ఉపయోగించారని పోలీసులు గుర్తించారు. మైనర్ల చేతికి కొకైన్, హెరాయిన్ వంటి వాటిని ఇచ్చి అవసరమైన వారికి అందిస్తున్నారు. పిల్లలైలతతే ఎవరికి కూడా  అనుమానం రాదని భావిస్తున్నారు. పిల్లల వెనుకే నిందితులు బైక్ లపై ఫాలో అవుతున్నారు. 

ముంబై, గోవాల నుండి సేకరించిన డ్రగ్స్ ను హైద్రాబాద్ లో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నారు. హైద్రాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 2021 లో సుమారు రూ. 200 కోట్లకు పైన డ్రగ్స్ పట్టుబడ్డాయి.

నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముంబై, గోవా లనుండి డ్రగ్స్ ను సరఫరా చేసే సమయంలో సినీ తారల పేర్లను కోడ్ ల నిందితులు ఉపయోగించారని పోలీసులు గుర్తించారు. ముంబైలో కత్రినా కైఫ్, కరీనా, సల్మాన్ ఖాన్ వంటి సినీ తారల పేర్లను ఉపయోగించారు. హైద్రాబాద్ లో ఆర్డీఎక్స్, ఎండీ స్టఫ్, మాల్ వంటి పేర్లను కూడా ఉపయోగిస్తున్నారు.

click me!