సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

By pratap reddyFirst Published Sep 24, 2018, 10:32 AM IST
Highlights

రాజకీయాల నుంచి తప్పుకోవాలనే తన కోరికను హరీష్ రావు వెల్లడించడంతో టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై చర్చ ముమ్మరమైంది. టిఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో ఇప్పటికీ హరీష్ రావు వార్తలు రావడం లేదు.

హైదరాబాద్: తన తనయుడు, ఆపద్ధర్మ మంత్రి కేటి రామారావుకు ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు పక్కా ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. హరీష్ రావుపై అప్రకటిత నిషేధం విధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

రాజకీయాల నుంచి తప్పుకోవాలనే తన కోరికను హరీష్ రావు వెల్లడించడంతో టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై చర్చ ముమ్మరమైంది. టిఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో ఇప్పటికీ హరీష్ రావు వార్తలు రావడం లేదు. సెప్టెంబర్ 7వ తేదీన జరిగిన కేసిఆర్ హుజురాబాద్ సభ తర్వాత హరీష్ రావు వార్తలపై నమస్తే తెలంగాణ దినపత్రికలో నిషేధం అమలవుతూ వస్తోంది. తన రిటైర్మెంట్ ప్రకటనపై వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. 

టీఆర్ఎస్ అధికారిక టీవీ చానెల్ టీ న్యూస్ లో కూడా హరీష్ రావు వార్తలు పెద్దగా రావడం లేదు. ఎమ్మెల్యేల వార్తలకు కూడా నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. కానీ హరీష్ రావుపై నిషేధం కొనసాగుతూనే ఉన్నట్లు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే గజ్వెల్, సిద్ధిపేట, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. దుబ్బాక అభ్యర్థిగా రామలింగా రెడ్డి పేరును ప్రకటించగా, సిద్ధిపేట నుంచి హరీష్ రావు పోటీ చేస్తారని ప్రకటించారు. గజ్వెల్ కు కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

సిద్ధిపేట నుంచి కేసిఆర్ స్వయంగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, హరీష్ రావుకు పూర్తిగా టికెట్ నిరాకరించడమో, లోకసభ సీటు ఇవ్వడమో చేస్తారని అంటున్నారు. హరీష్ రావును లోకసభకు పోటీ చేయించి, జాతీయ రాజకీయాలకు పంపించడం ద్వారా కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే తన ఆలోచనను కేసిఆర్ అమలు చేస్తారని అంటున్నారు. 

హరీష్ రావు కేటీఆర్ కు పోటీకి రాకుండా చేసే కేసిఆర్ ప్రణాళికలో భాగంగానే హరీష్ రావుపై అప్రకటిత నిషేధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో హరీష్ రావు అభిమానులు తీవ్రమైన గందరగోళానికి గురవుతున్నారు. 

సంబంధిత వార్తలు

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

click me!