హైదరాబాద్ నడిబొడ్డున దారుణం: బాలికపై రేప్, జననాంగంపై బ్లేడుతో గాట్లు, వీడియో చిత్రీకరణ

By telugu teamFirst Published Mar 9, 2019, 7:12 AM IST
Highlights

తనకు పరిచయం ఉన్న బాలికను పిలిచి వివస్త్రను చేసి కామాంధుడు అత్యాచారం చేశాడు. ఆమె శరీరంపై, జననాంగంపై బ్లేడుతో గాట్లు పెట్టాడు.బాధతో బాలిక పెట్టుకున్న మొరను వినిపించుకోలేదు.

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై ఓ దుండగుడు పశుప్రవృత్తితో ప్రవర్తించగా, అతని మిత్రులు మరింత రాక్షసానందం పొందారు.  తనకు పరిచయం ఉన్న బాలికను పిలిచి వివస్త్రను చేసి కామాంధుడు అత్యాచారం చేశాడు. ఆమె శరీరంపై, జననాంగంపై బ్లేడుతో గాట్లు పెట్టాడు.

బాధతో బాలిక పెట్టుకున్న మొరను వినిపించుకోలేదు. పైగా ఆ బాలుడి మిత్రులు మరింత దారుణంగా వ్యవహరించారు. బాలుడు అత్యాచారం చేస్తుండగా మొబైల్లో చిత్రీకరించారు. ఆ సమయంలో ఒళ్లంతా చూపాలంటూ బాలికను చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
 
పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు..  లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతంలో చంద్రాగనర్‌ కాలనీ, లిబర్టీ, ఆయిల్‌ సీడ్స్‌ కాలనీకి చెందిన కొందరు మగపిల్లలు రోజూ సాయంత్రం గంజాయి తాగుతుంటారు. స్థానికంగా నివసించే ఓ బాలిక (16)తో వీరు సాన్నిహిత్యం పెంచుకున్నారు. మెల్లగా ఆమెకూ గంజాయిని అలవాటు చేశారు. 

ఈ నెల 2న అర్ధరాత్రి దాటిన తర్వాత గంజాయి మత్తులో ఓ బాలుడుఆమెపై అత్యాచారం చేసాడు. ఆ దృశ్యాలను అతడి మిత్రుడు మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. తన స్నేహితులకు వాట్సప్ లో ఆ వీడియోను షేర్‌ చేశాడు. 

ఆ వీడియోను తొలగించాలని ఆ బాలిక నిందితుడిని వేడుకుంటూ  వచ్చింది. దాంతో నిందితుడు గురువారం సాయంత్రం తనను డీబీఆర్‌ మిల్స్‌ వద్ద కలవాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఆమె ఇంట్లో వాళ్లకు తన స్నేహితుల వద్దకు వెళ్తున్నాని, వెంటనే వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. తిరిగి రాలేదు. దీంతో మిస్సింగ్ కింద బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన గాంధీనగర్‌ పోలీసులు ఆ బాలికను గుర్తించారు. ఆ తర్వాత బాలికపై జరిగిన దారుణమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు, నిందితుడిని పట్టుకుని, దేహశుద్ధి చేశారు. అతడి ఫోన్‌లోని వీడియోలను డిలీట్‌ చేశారు. 

గాంధీనగర్‌ పోలీసులు ఆ బాలికను వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు.

click me!