మేం అధికారంలోకి వస్తే ప్రతి గింజ ధాన్యం కొంటాం: కేసీఆర్ పై ఈటల ఫైర్

By narsimha lodeFirst Published Apr 1, 2022, 1:02 PM IST
Highlights

ఇతర రాష్ట్రాలను చూసైనా  వరి ధాన్యం కొనుగోలుతో పాటు రైతుల సంక్షేమం కోసం కార్యక్రమాలను చేపట్టాలని  తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.


హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధరలు చెల్లించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. 

మాజీ మంత్రి  Etela Rajender  శుక్రవారం నాడు  హైద్రాబాద్ లోని BJP  కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదని ఆయన ఆరోపించారు.

Latest Videos

తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కేసీఆర్  అనాలోచిత, పిచ్చి నిర్ణయాల వల్ల కోటి ఎకరాలు పంట పండల్సిన చోట పంటలు పండించలేని దుస్థితి నెలకొందన్నారు. రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని  ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతులకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కొత్తగా Rice millsను ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో ఉన్న రైసు మిల్లులే ఉన్నాయన్నారు. ఈ మిల్లులు పాత టెక్నాలజీ నడుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

వరి ధాన్యం వస్తుందని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ప్లాన్ చేసుకోలేదని ఆయన విమర్శించారు. రైసు మిల్లుల్లో ఇంకా పాత టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని రైసు మిల్లుల్లో గంటకు 150 టన్నుల వరి ధాన్యం బియ్యంగా  మార్చుతున్నారన్నారు. అంతేకాదు పంట చేల నుండి నేరుగా ధాన్యాన్ని తమ మిల్లుల వద్దకు తీసుకెళ్లున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయని రాజేందర్ గుర్తు చేశారు. 

 రాష్ట్రంలో Maize  పంట వేయవద్దని రైతులను రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. దీంతో రాష్ట్రంలో మొక్కజొన్న దొరికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.  మొక్కజొన్న ధర క్వింటాల్ కు రప, 2700లకు కూడా మార్కెట్‌లో  దొరకని పరిస్థితి నెలకొందని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్రాల్లో రైతుల నుండి  ధాన్యాన్ని MSP కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలనుKCR  సర్కార్ నిర్వీర్యం చేసిందన్నారు.  Paddy ధాన్యం కొనుగోలు విషయంలో నెపం మొత్తం కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు  సీఎం  ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.లక్షలాది మంది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురును కేసీఆర్ పోసుకుంటున్నారన్నారు.

మాపై కోపాన్ని సీఎం కేసీఆర్ అధికారం ఇచ్చిన రైతులపై చూపుతున్నాడని ఈటల రాజేందర్ చెప్పారు.కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నందునే  నెపాన్ని కేంద్రంపై వేస్తున్నాడన్నారు.రైతులు పంటలు వేయకుండా కంటిలో మట్టికొట్టి కేసీఆర్ కనీళ్ళు చూస్తున్నారని కేసీఆర్ పై ఈటల మండిపడ్డారు. పంజాబ్ లో రెండో పంట గోధమలు వేస్తారని తెలిసికూడా కేసీఆర్ అవాస్తవాలు చెప్తున్నారన్నారు.ప్రతి గింజను కొంటామన్న ముఖ్యమంత్రి మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ధాన్యంసేకరిస్తోందన్న ఆశతో రైతులు కోతకు సిద్ధమవుతున్నారన్నారు.

కోటి మందికి రైతుబంధు ఇస్తే 35లక్షల ఎకరాల్లో మాత్రమే పంట రావటం విడ్డూరంగా ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. 17వేల మెగావాట్ల విద్యుత్ ఉత్తత్తి చేస్తోన్న రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు సిగ్గుమాలిన చర్యగా ఆయన పేర్కొన్నారు. నిధులు కేటాయించకుండా ఆసుపత్రుల అభివృద్ధి ఎలా సాధ్యమని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.ఏపీ, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు సిద్ధమయ్యాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 

click me!