నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 2,280 పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

By Arun Kumar PFirst Published Aug 29, 2024, 9:17 AM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియకు వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ఉద్యోగాలను భర్తీ చేయగా మరికొన్నింటికి భర్తీకి సిద్దంగా వుంది. తాజాగా ఇంకొన్ని ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసింది. 

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2,280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బోధనా,బోధనేతన సిబ్బంది కొరతను ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. రాష్ట్రంలోని పలు జూనియర్ కాలేజీల్లో1654 గెస్ట్ లెక్చరర్లు, 449 కాంట్రాక్ట్, 96 పార్ట్ టైమ్, 78 ఔట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి అనుమతిచ్చింది. ఈమేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు అంటే మార్చి 31, 2025 వరకు మాత్రమే ఈ నియామయం ద్వారా ఉద్యోగాలు పొందేవారు పనిచేయనున్నారు.    

Latest Videos

ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తెలంగాణలో భారీ ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రజా ప్రభుత్వం  దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. కేవలం మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు స్పష్టం చేసారు. మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి సిద్దమైనట్లు వెల్లడించారు. మొత్తంగా తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న చిత్తశుద్దితో ప్రభుత్వం వుందని సీఎం రేవంత్ తెలిపారు. 

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటే భారీగా ప్రైవేట్ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం సృష్టిస్తోంది. తాజాగా ప్రభుత్వ ఆహ్వానం మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపనీలు ముందుకు వచ్చినట్లు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన విలువైన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 30,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 

ఇదిలావుంటే తాజాగా కేంద్ర కేబినెట్ తెలంగాణలోని జహిరాబాద్ ప్రాంతంలో రూ.2,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కూడా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.  ఈ ప్రాజెక్ట్ పూర్తయితే లక్షా 74 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

click me!