ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్.. సుప్రీంకోర్టులో గంటన్నర పాటు వాదనలు

By Mahesh RajamoniFirst Published Aug 27, 2024, 1:17 PM IST
Highlights

MLC Kavitha : ఢిల్లీ మద్యం పాలసీ  కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది. మంగళవారం ఆమె  బెయిల్ సంబంధించి సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిపింది. 
 

BRS MLC Kalvakuntla Kavitha: తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసులో క‌విత ఇదివరకు అరెస్టు అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆమె తీహార్ జైలు లో ఉన్నారు. గ‌త కొంత‌కాలంగా ఆమె బెయిల్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉత్కంఠ‌కు తెర‌దించుతూ సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ సంద‌ర్భంగా క‌వితకు బెయిల్ మంజూరు చేసింది.

దేశ రాజ‌కీయాల‌ను షేక్ చేసిన ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణం కేసులో క‌విత అరెస్టు అయ్యారు. వీరితో పాటు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింత్ కేజ్రీవాల్ స‌హా ప‌లువురు మంత్రులు కూడా అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే.  తీహార్ జైలులో ఉన్న క‌విత బెయిల్ గురించి మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జ‌రిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ల‌తో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

Latest Videos

కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాద‌న‌లు వినిపించారు. దాదాపు గంటన్నరపాటు వాదనలు కొన‌సాగాయి. ఇరువైపులా వాదనల త‌ర్వాత బెంజ్ కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాల‌సీ కేసులో క‌విత 153 రోజులుగా తీహార్‌ జైల్లో ఉంటున్నారు. సుప్రీంకోర్టులో క‌ల్వ‌కుంట్ల‌ కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు వ‌చ్చారు. వారిలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. అలాగే,  వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి, ఎంపీ వద్దీరాజు రవిచంద్ర తదితరులు ఢిల్లీకి వ‌చ్చిన వారిలో ఉన్నారు.

click me!