కేసీఆర్‌కు ఈసీ షాక్... హెలికాఫ్టర్ ఖర్చులను లెక్కల్లో చేర్చాలని ఆదేశాలు

By sivanagaprasad kodatiFirst Published Nov 21, 2018, 2:03 PM IST
Highlights

హెలికాఫ్టర్ ద్వారా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన బుకింగ్ ఖర్చులను కూడా ఎన్నికల ఖర్చుల్లో చేర్చాలంటూ అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్‌ అందుకు గాను హెలికాఫ్టర్‌ను వినియోగిస్తున్నారు. గ్లోబల్  వెక్ట్రా అనే సంస్థకు చెందిన ఏడబ్ల్యూ 169 హెలికాఫ్టర్ ద్వారా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.

అయితే ఇందుకు సంబంధించిన బుకింగ్ ఖర్చులను కూడా ఎన్నికల ఖర్చుల్లో చేర్చాలంటూ అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో.. హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలిపాడ్లను నిర్మించేలా జిల్లా కలెక్టర్లను, రిటర్నింగ్ అధికారులను ఆదేశించాలని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ రెడ్డి నవంబర్ 17న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

దీనిపై స్పందించిన ఈసీ... హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలిపాడ్లను నిర్మించాలని కలెక్టర్లను ఆదేశించింది. మొత్తం 29 ప్రాంతాలకు ఆయన హెలికాఫ్టర్ ద్వారా చేరుకుని ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 19న ఖమ్మంలో ప్రారంభమైన కేసీఆర్ ప్రచార షెడ్యూల్ నవంబర్ 25న ఇబ్రహీంపట్నంలో ముగియనుంది. 

భర్తల గెలుపు కోసం.. రంగంలోకి భార్యలు

అక్బరుద్దీన్ పై పోటీ, బీజేపీ అభ్యర్థికి బెదిరింపులు

మహా కూటమికి "తారాబలం": బాలయ్యకు తోడు నగ్మా, జూ.ఎన్టీఆర్ కూడా...

సిరిసిల్లలో కేటీఆర్ పై నేరెళ్ల సంఘటన దెబ్బ?

కేసీఆర్‌పై అమీతుమీకి ఒంటేరు రె 'ఢీ': బాధ్యత హరీష్‌దే

సర్వే: కేసీఆర్‌కు అంత లేదు, మెరుగైన కాంగ్రెస్

రాహుల్‌ను కలవొచ్చు కానీ కేసీఆర్‌ను కలవలేం: గద్దర్

కేసీఆర్‌కు తెలిసింది రెండే.. ఒకటి అప్పులు, రెండు లిక్కర్ సేల్స్: కిషన్ రెడ్డి

ప్రాజెక్టుల్లో కేసీఆర్‌కు 6శాతం ముడుపులు, విచారణ: జైపాల్ సంచలనం
 

click me!