బ్రేకింగ్ న్యూస్....హైదరాబాద్ శివారులో కుప్పకూలిన విమానం

Published : Nov 21, 2018, 01:33 PM ISTUpdated : Nov 21, 2018, 01:42 PM IST
బ్రేకింగ్ న్యూస్....హైదరాబాద్ శివారులో కుప్పకూలిన విమానం

సారాంశం

హైదరాబాద్ శివారు ప్రాంతంలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి సమీపంలో ఓ ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. సాంకేతిక కారణాలతో విమానం కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకలేదు.  

శంకరంపల్లి మండలం మొకిల గ్రామంలోని ఓ వ్యవసాయం క్షేత్రంలో ఇవాళ ఉదయం భారీ శబ్దం చేస్తూ ఓ విమానం కూలిపోయింది. వరి పొలంలో విమాన శకలాలను గుర్తించిన గ్రామస్తులు సంబంధిత అధికారారులకు సమాచారం అందించారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫైలట్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం లేదని మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.  

ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమాన శకలాలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విమానాన్ని చూడడానికి సమీప గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. 

మరిన్ని వార్తలు

శంకర్ పల్లిలో కుప్పకూలిన విమానం (ఫోటోలు)
 
PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే