ఎన్నికల ప్రవర్తన నియమావళిని టీఆర్ఎస్ ఉల్లంఘిస్తోంది: కాంగ్రెస్

By narsimha lodeFirst Published Nov 21, 2018, 1:35 PM IST
Highlights

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికార పార్టీ పట్టించుకోవడం లేదని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు

హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికార పార్టీ పట్టించుకోవడం లేదని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేశామన్నారు.

బుధవారం నాడు గాంధీభవన్ లో మర్రి శశిధర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికారపార్టీకి వర్తించదా అని ఆయన ప్రశ్నించారు.  ఎన్నికలను పురస్కరించుకొని  కుల సంఘాలతో  అధికార పార్టీ నేతలు సమావేశాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారితో నిర్వహించిన సమావేశంలో అపద్ధర్మ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి కూడ పాల్గొన్నాడన్నారు.

ఈ విషయాన్ని ఎన్నికల  కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.  అధికార పార్టీ నేతలు  యదేచ్ఛగా  ఎన్నికల నియామళిని ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 23వ తేదీన మేడ్చల్‌లో  సోనియాగాంధీ సభను విజయవంతం చేయాలన్నారు.
 

click me!