నా చుట్టూ, గాంధీభవన్ చుట్టూ తిరిగితే టిక్కెట్లు రావు: ఉత్తమ్

Published : Oct 05, 2018, 01:37 PM ISTUpdated : Oct 05, 2018, 01:42 PM IST
నా చుట్టూ, గాంధీభవన్ చుట్టూ తిరిగితే టిక్కెట్లు రావు: ఉత్తమ్

సారాంశం

టిక్కెట్ల కోసం ఎవరూ కూడ  నా ఇంటి చుట్టూ, గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని  పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు


హైదరాబాద్: టిక్కెట్ల కోసం ఎవరూ కూడ  నా ఇంటి చుట్టూ, గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని  పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. పార్టీ కోసం  ఎవరు సిన్సియర్‌గా పనిచేస్తారో...వారికే  పార్టీ టిక్కెట్లను కేటాయించనున్నట్టు  ఉత్తమ్ స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు  హైద్రాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రెండేళ్లుగా సిటీ కాంగ్రెస్ కమిటీ లేకుండానే పనిచేయాల్సి వచ్చిందన్నారు. సిటీ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను ఆయన అభినందించారు.

హైద్రాబాద్ సిటీ పరిధిలోని 15 అసెంబ్లీ సీట్లలో కనీసం పది సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిందేనని ఉత్తమ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. టిక్కెట్ల కోసం తన ఇంటి చుట్టూ, గాంధీ భవన్ చుట్టు తిరగొద్దన్నారు. పార్టీ కోసం ఎవరూ సిన్సియర్‌గా పనిచేస్తారో తనకు తెలుసునని ఆయన చెప్పారు.  పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే  కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలకు పదవులిస్తామని హామీ ఇచ్చారు.

ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుండి 15‌కు పైగా ధరఖాస్తులు వచ్చాయని చెప్పారు.. తనకు వ్యక్తిగత ఇష్టాలు లేవని ఉత్తమ్ స్పష్టం చేశారు.. ఏ అభ్యర్థి బరిలో ఉంటే పార్టీకి ప్రయోజనమనే విషయాన్ని గుర్తించి  టిక్కెట్లను కేటాయించనున్నట్టు చెప్పారు.

తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలను నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు  ఉత్తమ్ సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి  కేసీఆర్ హాటావో... తెలంగాణ బచావో అంటూ ప్రచారం  చేయాలని ఉత్తమ్ కోరారు. నవంబర్ చివరి వారంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

డిఫెన్స్‌లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...

చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్

చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్

టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు