డ్రగ్స్ ముఠా: పోలీసుల దాడి, భవనంపై నుండి దూకి నైజీరియన్ మృతి

By narsimha lodeFirst Published Oct 5, 2018, 1:14 PM IST
Highlights

 హైద్రాబాద్ అయోధ్యనగర్ శ్రీసాయి సెంటర్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే  సమాచారంతో  పోలీసులు దాడులు నిర్వహించారు. 


హైదరాబాద్: హైద్రాబాద్ అయోధ్యనగర్ శ్రీసాయి సెంటర్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే  సమాచారంతో  పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే పోలీసుల నుండి తప్పించుకొనే క్రమంలో ఓ నైజీరియన్ అపార్ట్‌మెంట్ భవనం నుండి దూకి చనిపోయాడు.  మరో ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

హైద్రాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని  అయోధ్యగనర్ శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని టాస్క్‌పోర్స్ పోలీసులకు సమాచారం అందింది.

శుక్రవారం నాడు  ఉదయం  శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లో  నైజీరియన్లు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేశారు.ఈ దాడి సమయంలో పోలీసులను చూసిన పాట్రిక్ అనే నైజీరియన్  తప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 

అపార్ట్‌మెంట్ పై బాగానికి చేరుకొన్నారు. అయితే పోలీసులు వస్తుండడం తప్పించుకొనే మార్గం లేకపోవడంతో అపార్ట్‌మెంట్  పైపు పట్టుకొని పాట్రిక్ పారిపోయే ప్రయత్నం  చేశాడు. 

అయితే  పట్టుతప్పి పాట్రిక్ భవనం నుండి కిందపడిపోయాడు. పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.మరో ముగ్గురు  నైజీరియన్లు పోలీసుల అదుపులో ఉన్నారు. మృతుడిపై గతంలో రెండు మూడు కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.


 

click me!