వైఎస్ షర్మిల ఫిర్యాదు: 15 మందిని గుర్తించిన పోలీసులు

By pratap reddyFirst Published Jan 19, 2019, 7:11 AM IST
Highlights

షర్మిలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దూకుడు పెంచారు. షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దూకుడు పెంచారు. షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ఇందుకు సంబంధించి యూట్యూబ్‌లో దాదాపు 60 వీడియో లింకులను పోలీసులు గుర్తించారు. అవి ఏయే యూట్యూబ్‌ చానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో పడ్డారు. ఆయా చానల్స్‌లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యులను గుర్తిస్తున్నారు. శుక్రవారం నాటికి మొత్తం 15 మందిని గుర్తించారు. 

వీరిలో ఐదుగురిని పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్టేషన్ కు తిసుకుని వచ్చి  విచారించారు. ఆ తర్వాత నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. వారు సొంతంగా యూట్యూబ్‌ చానల్స్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో మరికొందరిని విచారించాలని నిర్ణయించారు. 

ఆయా చానల్స్‌లో ఉన్న 60 వీడియోలకు దిగువన అనేక మంది అభ్యం తరకరంగా కామెంట్స్‌ చేశారు.  వీడియో పోస్ట్‌ చేసిన వారితోపాటు ఈ కామెంట్స్‌ చేసిన వ్యక్తులు కూడా నిందితులవుతారని అంటున్నారు.

వ్యాఖ్యలు చేసిన వారి ఐడీలను గుర్తిస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారి లాగిన్, ఐపీ వివరాలు ఇవ్వాల్సిందిగా యూట్యూబ్‌కు లేఖలు రాస్తున్నారు. 

సంబంధిత వార్తలు

షర్మిల ఫిర్యాదు: యూట్యూబ్, గూగుల్‌లకు లేఖ

ప్రభాస్ తో అఫైర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిలకు రాములమ్మ బాసట

షర్మిలకు బాబు కౌంటర్: నమ్మకపోతే పోటీ ఎందుకు

దగుల్బాజీ, గజ్జి కుక్కలు: వైఎస్ షర్మిల ఇష్యూపై చిన్నికృష్ణ

బాబుకు అలవాటే, చిరుపై లాగానే వైఎస్ షర్మిలపై..: పోసాని

షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

click me!