ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిక: హరీష్‌కు చెక్?

By narsimha lodeFirst Published Jan 18, 2019, 7:27 PM IST
Highlights

టీఆర్ఎస్‌లో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గిపోతోందా? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం వెనుక హరీష్‌ పాత్రను గజ్వేల్‌ నుండి తప్పించడమే  ఉద్దేశ్యమేనా? ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే సమయంలో హరీష్ రావు గైరాజరయ్యారు. 


హైదరాబాద్: టీఆర్ఎస్‌లో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గిపోతోందా? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం వెనుక హరీష్‌ పాత్రను గజ్వేల్‌ నుండి తప్పించడమే  ఉద్దేశ్యమేనా? ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే సమయంలో హరీష్ రావు గైరాజరయ్యారు. ఈ పరిణామాలన్నీ చూస్తే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతోందా అనే చర్చ సాగుతోంది. అయితే హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వర్గీయులు కొట్టిపారేస్తున్నారు.

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా హరీష్ రావు‌‌కు పేరుంది. ఎంతటి క్లిష్టమైన పనైనా హరీష్ రావు తన వ్యూహంతో  టీఆర్ఎస్‌కు అనుకూలంగా  మార్చుస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. ప్రత్యర్థి పార్టీలు కూడ హరీష్‌రావును మంచి స్ట్రాటజిస్టుగా పేర్కొంటారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  కేటీఆర్‌ ను నియమించిన సమయం నుండే హరీష్‌రావును క్రమంగా  పార్టీలో ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేసే వాళ్లు కూడ లేకపోలేదు.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్టుగా కేసీఆర్  ప్రకటించిన వెంటనే హరీష్ రావుతో  కేటీఆర్  సమావేశమయ్యారు.

 వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పార్టీలో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  పార్టీలో కేటీఆర్, కేసీఆర్‌లకు తెలియకుండానే  ఏ కార్యక్రమం జరిగే అవకాశం లేదు. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్ తరపున ప్రచార బాధ్యతలను హరీష్ రావు తీసుకొన్నారు.

కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను హరీష్‌రావు తన భుజాన వేసుకొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో  గజ్వేల్‌ నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హరీష్ రావు వ్యూహలు ఫలించాయి. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడంలో హరీష్ రావు ప్లాన్ సక్సెస్ అయింది.డీకే అరుణ, రేవంత్ రెడ్డి లాంటి నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయడంలో హరీష్ రావు పాత్రను ఎవరూ తోసిపుచ్చలేరు. 

ఇదిలా ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో  రెండు దఫాలు కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలైన ప్రతాప్ రెడ్డి  టీఆర్ఎస్ లో చేరారు. భవిష్యత్తులో  గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాల్లో  ప్రతాప్ రెడ్డి కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. హరీష్‌ను తప్పించే ఉద్దేశ్యంతోనే ప్రతాప్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చారా  అనే చర్చ కూడ లేకపోలేదు.

సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పౌరసరఫరాల సంస్థ ఛైర్మెన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ వీర విధేయుడుగా పేరుంది. టీఆర్ఎస్ రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారెడ్డి శ్రీనివాస్ రెడ్డగికి  పౌరసరఫరాల సంస్థ ఛైర్మెన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు.

కొంతకాలంగా శ్రీనివాస్ రెడ్డి  పార్టీ కార్యక్రమాల్లో అంతగా యాక్టివ్ గా లేరు. ఈ తరుణంలో  శ్రీనివాస్ రెడ్డికి పదవి ఇవ్వడాన్ని కూడ ప్రస్తావిస్తున్నారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గం నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

. మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ వ్యవహరాల్లో  హరీష్ రావు పాత్ర కచ్చితంగా ఉంటుంది. అయితే ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్‌లో తీసుకురావడంలో హరీష్ రావు కూడ తెర వెనుక మంత్రాంగాన్ని పోషించారని  ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు.

అయితే తెలంగాణ భవన్ లో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే కార్యక్రమంలో  హరీష్ రావు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగానే  రాలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఎవరు గద్దలు: చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్

టీఆర్ఎస్‌లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి

కేసీఆర్ నాకు బాస్, టీఆర్ఎస్‌లో చేరుతున్నా: ఒంటేరు

కారెక్కనున్న వంటేరు: తెర వెనక మంత్రాంగం ఆయనదే...

కేసీఆర్ ప్లాన్ ఇదీ: ఒంటేరుకు ఆహ్వానం అందుకే

టీఆర్ఎస్‌లోకి కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి

Last Updated Jan 18, 2019, 7:42 PM IST