హైదరాబాద్ రామచంద్రాపురంలో డ్రగ్స్ విక్రయిస్తోన్న అరబ్ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతను గతంలోనూ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ రామచంద్రాపురంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తూ ఓ అరబ్ టీచర్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. అతని నుంచి 13 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నైజీరియా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని వ్యాపారులు, విద్యార్ధులకు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పెడ్లర్ గతంలోనూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
కాగా.. కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 513 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి . దీని విలువ రూ.1000 కోట్లు వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ వారిలో ఒక మహిళ కూడా వున్నట్లుగా తెలుస్తోంది. ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ వున్నట్లుగా సమాచారం రావడంతో ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ దాడులు చేసింది.
undefined
Also REad:గుజరాత్‌లో ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ దాడులు.. బస్తాలకొద్దీ డ్రగ్స్ పట్టివేత, 500 కేజీలపైనే
అటు కొద్దిరోజుల క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఏకంగా 700 కేజీల నిషేధిత మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దాని విలువ సుమారు రూ.1400 కోట్లుకు పై మాటే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసొపారాలో ఉన్న ఫార్మా స్యూటికల్ తయారీ యూనిట్‌పై ముంబై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ. 1,400 కోట్ల విలువైన 700 కిలోలకు పైగా 'మెఫెడ్రోన్'ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ డ్రగ్ సెల్ (ANC) ఈ దాడులు నిర్వహించిందని పోలీసులు తెలిపారు. యాంటీ డ్రగ్ సెల్ కు ఈ ప్రాంతంలో నిషేధిత డ్రగ్ 'మెఫెడ్రోన్' తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.