బిస్కట్లలో ఇనుప తీగలు.. వీటిని మీ పిల్లలు తింటున్నారా? జాగ్రత్త

Published : Oct 10, 2024, 07:38 PM ISTUpdated : Oct 10, 2024, 07:47 PM IST
  బిస్కట్లలో ఇనుప తీగలు.. వీటిని మీ పిల్లలు తింటున్నారా? జాగ్రత్త

సారాంశం

Iron Wire Found in Bourbon Biscuit : ఓ కంపెని తయారు చేసిన బిస్కట్లలో ఇనుప తీగలు వచ్చాయి. తన పిల్లలు తింటుండగా సంబంధిత బిస్కట్లలో ఈ ఇనుప చువ్వలను గుర్తించిన వ్యక్తి..  వీటిని ఎవరూ తినకూడదని హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Iron Wire Found in Bourbon Biscuit : ఒక పిల్లాడు బిస్కట్లను తింటుండగా వాటిలో ఇనుప తీగలు వచ్చాయి. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన పిల్లల కోసం తెచ్చిన బోర్బన్ బిస్కెట్లలో ఒకదానిలో సన్నని ఇనుప తీగలు రావడం షాక్ గురి చేసింది. దీనికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారింది. వీటిని ఏవరూ తినకూడదని హెచ్చరించాడు.

పలు మీడియా నివేదికల ప్రకారం.. దేవుని పల్లి గ్రామంలోని స్థానిక దుకాణంలో హనుమంతరెడ్డి అనే వ్యక్తి ఇనుప తీగలతో కలుషితమైన బిస్కట్లకు సంబంధించిన వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. పిల్లలు అలాంటి ఉత్పత్తులను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

Xలో కలుషితమైన ఈ బిస్కట్ల చిత్రాలను షేర్ చేస్తూ ఇలాంటి కలుషితమైన ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ బిస్కట్లు బ్రిటానియా కంపెనీకి చెందిన బోర్బన్ బిస్కట్లుగా అతను పేర్కొన్నాడు. అతను బిస్కట్ ప్యాకెట్ ను చూసిస్తూ వీటిని తినవద్దని హెచ్చరించారు. 

 

 

అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ వద్ద ఒక మెట్రో ప్రయాణీకుడు దుకాణంలో కొన్న చాక్లెట్‌ లో పురుగులు గుర్తించిన ఇటీవల ఘటన తర్వాత ఇప్పుడు కామారెడ్డిలో బిస్కట్లలో ఇనుప తీగలు వెలుగులోకి వచ్చాయి. రాబిన్ జాకియస్ అనే వ్యక్తి తాను మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన పురుగులు పట్టిన చాక్లెట్ వీడియోను షేర్ చేశాడు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు