రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

By pratap reddyFirst Published Oct 4, 2018, 7:21 AM IST
Highlights

రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు ఉదయసింహను కూడా అధికారులు ప్రశ్నించారు. వారిద్దరి విచారణ ప్రక్రియను వీడియోలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని ఐటి అధికారులు రేవంత్ రెడ్డికి సూచించారు. 

హైదరాబాద్: కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఐటి అధికారాలు బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు విషయంలోనే ఈ విచారణ సాగినట్లు అనిపిస్తోంది. రేవంత్ రెడ్డి విచారణ జరుగుతున్న ఆయకార్ భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ అధికారులు విచారణపై సమాచారం సేకరిస్తూ కనిపించారు. 

నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షల  రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై రేవంత్ రెడ్డిని ఐటి అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ప్రారంభించిన షెల్ కంపెనీలపై కూడా విచారించినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు ఉదయసింహను కూడా అధికారులు ప్రశ్నించారు. వారిద్దరి విచారణ ప్రక్రియను వీడియోలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని ఐటి అధికారులు రేవంత్ రెడ్డికి సూచించారు. 

స్టీఫెన్ సన్ కు 5 కోట్ల రూపాయలను ఇవ్వడానికి అంగీకరించి, 50 లక్షల రూపాయలు ఇవ్వజూపిన తరుణంలో రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ ఐదు కోట్ల రూపాయలు ఎలా చెల్లిద్దామని అనుకున్నారని ఐటి అధికారులు బుధవారంనాటి విచారణలో రేవంత్ రెడ్డిని అడిగినట్లు తెలుస్తోంది. 

కెఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాకు చెందిన కెఎల్ శ్రీధర్ రెడ్డి ఇంటిలో సీజ్ చేసిన 1.5 కోట్ల రూపాయల గురించి కూడా రేవంత్ రెడ్డిని ఐటి అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఎ. కొండల్ రెడ్డి, కృష్ణా రెడ్డిలకు చెందిన భూపా ఇన్ ఫ్రా గురించి కూడా విచారించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ చుట్టూ ఉచ్చు: ఉప్పల్ లో తేలిన ఉదయసింహ ఫ్రెండ్ రణధీర్

ఐటి దాడులు: ఉదయసింహ సంచలన ప్రకటన

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

click me!