''మెత్తగా...మెల్లగా మాట్లాడితే ఎలా....జానారెడ్డి కాస్త దూకుడు పెంచాలి''

By Arun Kumar PFirst Published Oct 3, 2018, 9:06 PM IST
Highlights

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి డిపరెంట్ స్టైల్. మంచి పని చేస్తే ప్రత్యర్థి పార్టీని కూడా నిర్మొహమాటంగా ప్రశంసించే వ్యక్తి ఆయన. అలాగే ఎంత పెద్ద ఆరోపణలపనైనా సుతిమెత్తగా విమర్శలు చేయడం జానారెడ్డి నైజం. అయితే జానారెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జానారెడ్డిది ఏ విషయంలోనైనా వెనుకంజ వేసే స్వభావం కాదని జైపాల్ రెడ్డి అన్నారు. అలాగని దూకుడుగా ముందుకువెళ్లే స్వభావం కూడా కాదన్నారు. ఆచి తూచి వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. కానీ అన్ని వేళల్లో ఇలా మెల్లగా...మెత్తగా ఉండటం మంచిదికాదని జైపాల్ రెడ్డి తెలిపారు. ఇలా ఉంటే బలహీన వ్యక్తి అని ముద్ర వేస్తారని సూచించారు. కాబట్టి అప్పుడప్పుడు దూకుడుగా ఉండాలని జానారెడ్డికి జైపాల్‌రెడ్డి హితవు పలికారు.

అలాగే జానా రెడ్డి నిజాయితీ గల వ్యక్తి అని....అబద్దాలు చెప్పడం అతడికి అలవాటులేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాలే మాట్లాడతారని ప్రశంసించారు. తెలంగాణ లో జానారెడ్డి అంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎవరికీ లేదని అన్నారు. రాజకీయాలకోసం అప్పుడప్పుడు ధర్మాగ్రహం ప్రదర్శించాలని జానారెడ్డికి జైపాల్ సూచించారు.

click me!