నయీం బ్యాచ్ తోనే ప్రణయ్ ని చంపాలని చూశారు.. అమృత

Published : Sep 15, 2018, 03:33 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
నయీం బ్యాచ్ తోనే ప్రణయ్ ని చంపాలని చూశారు.. అమృత

సారాంశం

తాను ప్రస్తుతం ఐదో నెల గర్భవతినని తెలిపిన అమృత.. అబార్షన్ చేయించుకోవాలని తన తండ్రి తనను ఎంతగా ఒత్తిడి చేశారో కూడా వివరించింది.

మిర్యాలగూడ పరువు హత్యలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కళ్లెదుటే భర్తపై దాడి జరగడాన్ని చూసి షాక్ కి గురైన ప్రణయ్ భార్య అమృత.. ఈ రోజు ఉదయం కోలుకున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో ఉన్న ఆమెను ఈ రోజు మధ్యాహ్నం ఎస్పీ రంగనాథ్ కలిశారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు.

కాగా.. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలను అమృత చెప్పే ప్రయత్నం చేసింది. తాను ప్రణయ్ ని పెళ్లి చేసుకోవడం తన తండ్రికి అసలు ఇష్టం లేదని స్పష్టం చేసింది. నయీం బ్యాచ్ తోనే ప్రణయ్ ని చంపించాలని తన తండ్రి ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది. తాను ప్రస్తుతం ఐదో నెల గర్భవతినని తెలిపిన అమృత.. అబార్షన్ చేయించుకోవాలని తన తండ్రి తనను ఎంతగా ఒత్తిడి చేశారో కూడా వివరించింది.

తన తండ్రి ఎంత ఒత్తిడి చేసినా తాను అబార్షన్ చేయించుకోలేదని.. ఆ కక్షతోనే ప్రణయ్ ని హత్య చేశారని వాపోయింది. తాను అసలు హాస్పటల్ కి చెకప్ కోసం రాకపోయి ఉంటే తన భర్త బ్రతికే ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రణయ్ చనిపోతే.. తాను పుట్టింటికి వస్తానని వాళ్లు భావించారని.. కానీ తాను తన అత్తారింట్లోనే ఉంటానని స్పష్టం చేసింది. 

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య కలచివేసింది: అమృతకు ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శ

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌