టీఆర్ఎస్ ప్రచార సభలో కుప్పకూలిన వేదిక... గాయపడ్డ ఎంపీ,తాజా మాజీ ఎమ్మెల్యే

Published : Sep 15, 2018, 03:26 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
టీఆర్ఎస్ ప్రచార సభలో కుప్పకూలిన వేదిక... గాయపడ్డ ఎంపీ,తాజా మాజీ ఎమ్మెల్యే

సారాంశం

ముందస్తు ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతిరోజు తమ నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహిస్తూ అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వరంగల్ జిల్లాలో ఇవాళ టీఆర్ఎస్ ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. ప్రచార సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక కుప్పకూలడంతో స్థానిక ఎంపితో పాటు తాజా మాజీ ఎమ్మెల్యే స్వల్పంగా గాయపడ్డారు. పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యారు.  

వరంగల్ జిల్లా ఐనవోలు ఆలయంలో పూజలు చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు స్థానిక ఎంపి పసునూరి దయాకర్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కార్యకర్తలు, ప్రజలతో ఓ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రచార సభకు వర్షం కాస్త ఆటంకం కలిగించింది.

ఈ వర్షపు నీటితో సభా వేధిక మొత్తం బాగా తడిసిపోయింది. అయితే వర్షం తగ్గగానే మాజీ ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు స్టేజీ పైకి ఎక్కారు. దీంతో అప్పటికే బాగా తడిసివున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆరూరి రమేష్ తో పాటు ఎంపి దయాకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వీరితో పాటు లలితయాదవ్‌, యాదవరెడ్డి, ఎంపీపీ  రవీందర్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌రావు, గజ్జెల్లి శ్రీరాములు, జడ్పీటీసీ శ్రీరామోజి అరుణజయాకర్‌లకు కూడా గాయాలయ్యాయి.   

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu