టార్గెట్ తెలంగాణ: హైద్రాబాద్‌కు చేరుకొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

First Published Jul 13, 2018, 12:15 PM IST
Highlights

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నాడు హైద్రాబాద్ కు చేరుకొన్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో  కార్యకర్తలనుద్దేశించి మాట్లాడకపోవడంతో కార్యకర్తలు నిరాశ చెందారు. కత్రియా హోటల్ లో ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.


హైదరాబాద్:బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  శుక్రవారం నాడు  హైద్రాబాద్‌కు  చేరుకొన్నారు.  బీహార్ రాష్ట్రం నుండి ప్రత్యేక విమానంలో  శుక్రవారం నాడు  అమిత్ షా హైద్రాబాద్‌కు వచ్చారు.  తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో అమిత్ షా శుక్రవారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు.

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీకి చెందిన పలువురు తెలంగాణ నేతలు  అమిత్ షాకు ఘనంగా స్వాగతం పలికారు.  బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున  కార్యకర్తలు చేరుకొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతారని భావించారు. కానీ, ఆయన మాత్రం  మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

కత్రియా హోటల్‌లో ఆర్ఎస్ఎస్ నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు.  అమిత్ షా తమతో మాట్లాడకుండానే  వెళ్లిపోవడంపై బీజేపీ  క్యాడర్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా అమిత్ షా పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇందులో భాగంగానే అమిత్ షా ఇవాళ పర్యటన సాగుతోంది.
 

click me!