ఇంటర్నెట్ సర్వీసుల్లోకి షియోమీ... రూ.3,500 కోట్ల పెట్టుబడులతో

By Arun Kumar PFirst Published Apr 1, 2019, 4:12 PM IST
Highlights

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, స్పొటిపై, పేటీఎం, గూగుల్ పే వంటి సంస్థలతో పోటీ పడుతూ ఇంటర్నెట్ మోనిటైజేషన్ సేవల్లో అడుగు పెట్టేందుకు షియోమీ సిద్ధమవుతోంది. 

స్మార్ట్ ఫోన్ల విభాగంలో దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ సంస్థను అధిగమించిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో సాహసోపేతమైన అడుగేయబోతున్నది. ఇంటర్నెట్‌ రంగంలోనూ సేవలందించేందుకు సిద్ధం అయింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, స్పొటిఫై, పేటీఎం, గూగుల్ పే తదితర మోనెటైజింగ్ ఇంటర్నెట్ సర్వీసుల్లో అడుగు పెట్టింది. 

టాప్ ఫైన్ మోస్ట్ వాల్యూబుల్ టెక్నాలజీ స్టార్టప్స్‌లో  షియోమీ ఒకటిగా నిలిచింది. స్ట్రీమింగ్ వీడియోలు, మ్యూజిక్, డిజిటల్ పేమెంట్, అప్లికేషన్స్ ద్వారా ఆదాయం, లాభాలను గడిస్తూ ముందుకు సాగుతోంది షియోమీ. తాజాగా షియోమీ తదుపరి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి  రూ.3,500 కోట్లు సిద్ధమైందని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. 

అంతర్జాతీయంగా తమ సంస్థ హార్డ్ వేర్ రంగంలో ఒక్కశాతం లాభం గడించిందన్నారు. హార్ద్ వేర్ రంగంలో ఏనాడు ఐదు శాతానికి మించి లాభాలు పొందలేరని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. 

ఎంఐ వీడియో, ఎంఐ మ్యూజిక్, ఫైల్ ట్రాన్స్ ఫర్ టూల్ ఎంఐ డ్రాప్ ఇప్పటికే 100 మిలియన్ల డౌన్ లోడ్స్ దాటాయి. ఎంఐ పే ద్వారా షియోమీ కోసం యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా డిజిటల్ చెల్లింపులకు లైసెన్స్ పొందింది. ఎంఐ క్రెడిట్ రూపంలో కమర్షియలైజేషన్ సాధించింది. క్రెడిట్ బీ, జెస్ట్ మనీ వంటి సంస్థలు ఇన్ స్టంట్ రుణ పరపతి పొందొచ్చు. 
  

click me!