మ్యూజిక్ లవర్స్ కోసం లేటెస్ట్ ఇయర్ బడ్స్.. ఫస్ట్ టైం AI టెక్నాలజీతో లాంచ్..

By Ashok kumar SandraFirst Published Apr 23, 2024, 3:58 PM IST
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ తర్వాత సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇయర్ బడ్స్‌ను లాంచ్  చేసింది.

నథింగ్ ఫోన్ ఇండియాలో  కొత్త సెన్సేషన్  సృష్టించిన తరువాత ఇప్పుడు లేటెస్ట్ న్యూ  ఇయర్‌బడ్స్  లాంచ్ చేసింది. దీని స్పెషాలిటీ  ఏంటంటే ఈ  ఇయర్‌బడ్స్ మొట్టమొదటి ఆర్టిఫీషియల్  ఇంటెలిజెన్స్  టెక్నాలజీగల ఇయర్ బడ్స్. అయితే దీని ఫీచర్స్, ధర ఎంతంటే..

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ తర్వాత సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇయర్ బడ్స్‌ను లాంచ్  చేసింది. ఇవి ఆడియో ఇంకా  స్మార్ట్‌ఫోన్ ప్రొడక్ట్స్ లో ఇండస్ట్రీ-ఫస్ట్ ChatGPT ఇంటిగ్రేషన్‌తో  వస్తున్న అత్యాధునిక ఇయర్‌బడ్స్. ఈ రెండు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నథింగ్ ఇయర్ అండ్  నథింగ్ ఇయర్ (ఎ) తాజాగా మార్కెట్లో లాంచ్ చేయబడ్డాయి.

గత మూడు సంవత్సరాలుగా డిజైన్ అండ్  ఇంజినీరింగ్‌లో నిరంతర మెరుగుదలతో బ్రాండ్ కొత్త ఆడియో ప్రొడక్ట్స్  మ్యూజిక్   లవర్స్ కి  మంచి అనుభవాన్ని అందిస్తాయని నథింగ్ పేర్కొంది.   

ధర
ఈ హ్యాండ్ సెట్ ధర రూ.11,999. ఏప్రిల్ 29 నుంచి సేల్స్  ప్రారంభం అవుతాయి. నథింగ్ ఇయర్(A) ధర రూ. 7,999, ఏప్రిల్ 22 నుంచి సేల్   మొదలయ్యాయి. ఇవి ఫ్లిప్‌కార్ట్, క్రోమా అండ్ విజయ్ సేల్స్‌ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఇయర్ స్పెషల్ లాంచ్  ధర రూ. 10,999  ఇంకా  నథింగ్ ఇయర్ (ఎ)  ధర  రూ. 5,999.

నథింగ్ ఇయర్ - సౌండ్ కోసం కొత్త లుక్
 నథింగ్ ఇయర్  ట్రాన్స్పరెంట్  ఇయర్‌బడ్ డిజైన్‌  అలాగే ఉంచి ఇయర్ (A) డిజైన్ మెరుగుపర్చింది. ఇంకా ఇవి  అత్యుత్తమ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. రిచ్ సౌండ్ అలాగే  ఫెరఫార్మెన్స్ లో రాజీ పడలేదు.

సౌండ్  క్వాలిటీ
 నథింగ్ ఇయర్ నథింగ్ అత్యంత లేటెస్ట్  డ్రైవర్ సిస్టమ్‌తో వస్తుంది. దీనిలో  11mm డైనమిక్ డ్రైవర్‌ ఉంది. మేము అత్యంత స్టాండర్డ్  అలాగే  స్పష్టమైన సౌండ్  అందించడానికి ప్రీమియం మెటీరియల్‌లను సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా సౌండ్  కోసం సిరామిక్ డయాఫ్రాగమ్‌ని ఉపయోగించాము. 

బ్లూటూత్ ద్వారా హై రిజల్యూషన్ స్ట్రీమింగ్ కోసం ఇయర్  LHDC 5.0 అండ్  LDAC కోడెక్‌లకు సపోర్ట్  ఇస్తుంది. దీని వల్ల  పవర్ ఫుల్, క్లిన్ ఆడియో వస్తుంది. Kiwi LHDC 5.0, LDAC ద్వారా 1 Mbps 24 బిట్/192 kHz వరకు 990 kbps అంతేకాకుండా  24 bit/96 kHz ఫ్రీక్వెన్సీలను చేరుకోగలదు.

click me!