ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటరుగా జియో.. చైనా మొబైల్ని కూడా బీట్ చేసిన కంపెనీ..

By Ashok kumar Sandra  |  First Published Apr 23, 2024, 6:06 PM IST

తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం జియో నెట్‌వర్క్‌లో మొత్తం డేటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్‌లకు చేరుకుంది.  గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే డాటా ట్రాఫిక్ దాదాపు 35.2 శాతం పెరిగింది. 


రిలయన్స్ ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాలలో జియో జోరును కొనసాగించింది. తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం జియో నెట్‌వర్క్‌లో మొత్తం డేటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్‌లకు చేరుకుంది.  గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే డాటా ట్రాఫిక్ దాదాపు 35.2 శాతం పెరిగింది. 5G ఇంకా  హోమ్‌ లపై పెరిగిన ట్రాక్షన్ ద్వారా ఇది సాధ్యపడింది. మొబిలిటీ డేటా ట్రాఫిక్‌లో 5G సేవలు దాదాపు 28% వాటాతో ఉంటాయి. జియో నెట్‌వర్క్‌లో ప్రతినెలా డేటా ట్రాఫిక్ 14 ఎక్సాబైట్‌లను దాటింది. 

2018లో భారతదేశ  ప్రతినెల మొబైల్ డేటా ట్రాఫిక్ 4.5 ఎక్సాబైట్లు మాత్రమే. కోవిడ్  నుంచి వార్షిక డేటా ట్రాఫిక్ 2.4 రేట్లు పెరిగింది.  తలసరి ప్రతినెల  డేటా వినియోగం మూడేళ్ల క్రితం కేవలం 13.3 GB ఉండగా ఇప్పుడు అది 28.7 GBకి పెరిగింది.

Latest Videos

మార్చి 2024 నాటికి జియో సబ్‌స్క్రైబర్ బేస్ 48.18 కోట్లకు చేరుకుంది. అందులో 10.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు జియో ట్రూ5G స్టాండలోన్ నెట్‌వర్క్‌లో ఉన్నారు.

click me!