ఐఫోన్ల పై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

By ramya neerukondaFirst Published Oct 16, 2018, 4:06 PM IST
Highlights

ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌  256జీబీ  స్మార్ట్‌ఫోన్‌పై  భారీగా 20వేల  రూపాయల క్యాష్ బ్యాక్ ఉంది.  ఇప్పటికే ఈ ఫోన్‌ మార్కెట్ ధర రూ. 1,05,720తో పోలిస్తే. రూ .3830 డిస్కౌంట్‌  ఆఫర్‌తో 1,01,890 రూపాయలవద్ద పేటీఎం మాల్‌ విక్రయించింది. 

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని పేటీఎం మాల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. నేటి నుంచి (అక్టోబర్ 16) ఈ నెల 18 వరకు పేటీఎం మాల్‌ మరోసారి ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో అనేక ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. తాజా ఐ ఫోన్లపై  మహా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌  256జీబీ  స్మార్ట్‌ఫోన్‌పై  భారీగా 20వేల  రూపాయల క్యాష్ బ్యాక్ ఉంది.  ఇప్పటికే ఈ ఫోన్‌ మార్కెట్ ధర రూ. 1,05,720తో పోలిస్తే. రూ .3830 డిస్కౌంట్‌  ఆఫర్‌తో 1,01,890 రూపాయలవద్ద పేటీఎం మాల్‌ విక్రయించింది. 

64 జీబీ ఐఫోన్ ఎక్స్‌పై రూ. 3502 తగ్గింపు లభిస్తుంది. అంటే మార్కెట్‌ ధర రూ. 95,390 నుంచి 91,888 రూపాయలకు లభ్యం. అలాగే రూ. 22వేల  దాకా  క్యాష్‌  బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ పొందేందుకు MOBFESTIVE18K  ప్రోమో కోడ్‌ను  ఉపయోగించాలి. 

అంతేకాదు ఐ ఫోన్‌ ఎక్స్‌ఎస్‌  కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఉంది. IPH5000 ప్రోమో కోడ్‌  ద్వారా 64జీబీ   ఐఫోన్‌ కొనుగోలుపై 5వేల దాకా క్యాష్‌ బ్యాక్‌ ఉంది.   
256 జీబీ స్మార్ట్‌ఫోన్‌ లో 12వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌. దీనికి  ప్రోమో కోడ్ MOBFESTIVE12K. వీటితోపాటు 64జీబీ  ఐఫోన్ 8 ప్లస్‌పై  13వేల రూపాయల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌   ప్రోమో కోడ్ MOBFESTIVE13K.. 256జీబీ  ఐఫోన్ 8 కొనుగోలుపై 13500 క్యాష్ బాక్ ఉంది. ప్రోమో కోడ్MOBFESTIVE13500.

32జీబీ , 128జీబీ ఐఫోన్ 7 వరుసగా 4500, 8500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ .ప్రోమో కోడ్  MALLFESTIVE8500.32జీబీ  ఐఫోన్ 6ఎస్‌ లో రూ. 3500 వరకు క్యాష్ బ్యాక్  అందిస్తోంది. చివరగా, 32జీబీ ఐఫోన్ 6 వేరియంట్ 6000 క్యాష్ బ్యాక్  ఆఫర్‌ చేస్తోంది. ప్రోమోకోడ్‌ ద్వారానే ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ చేస్తుంది.  ప్రోమోకోడ్‌ ద్వారా ఆఫర్‌ చేస్తున్న నగదును  ఐఫోన్లను డెలివరీ చేసిన 24 గంటల్లోపు  కస‍్టమర్ల ఖాతాలో క్రెడిట్‌చేస్తామని కంపెనీ  తెలిపింది. 

దీంతోపాటు దుస్తులపై గరిష్టంగా 70 శాతం రాయితీని ప్రకటించింది.  కంప్యూటర్ ఉత్పత్తులపై 25 శాతం క్యాష్‌బ్యాక్‌ను, గేమింగ్ కన్సోల్స్‌పై రూ.6 వేల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌. అలాగే గృహోపకరణాలపై 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్‌పై కూడా ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది.

click me!