ఎటిఎం కార్డ్ లేకుండా డబ్బు.. ఆధార్‌, ఫోన్ నంబర్ ఉంటే చాలు..

By Ashok kumar SandraFirst Published Apr 26, 2024, 6:08 PM IST
Highlights

మీరు ఆధార్ కార్డ్ తో మాత్రమే UPI పిన్‌ని జనరేట్ చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్ OTPని ఎంటర్ చేయడం ద్వారా UPI పిన్‌ను ఈజీగా  సెట్ చేయవచ్చు.
 

మీరు డెబిట్ కార్డ్(atm card) లేకుండా కూడా UPI ఉపయోగించి డిజిటల్ ట్రాన్సక్షన్స్  చేయవచ్చు. దీని కోసం మీ ఆధార్ నంబర్ అవసరం. అయితే UPI ట్రాన్సక్షన్స్ కోసం మీరు మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. దీని తర్వాత, మీరు ఆధార్ కార్డ్ నుండి UPI పిన్‌ను జనరేట్ చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్ OTPని ఎంటర్  చేయడం ద్వారా UPI పిన్‌ను సులభంగా సెట్ చేయవచ్చు. దీంతో డెబిట్ కార్డ్ లేని వారు కూడా యూపీఐని ఉపయోగించుకోగలుగుతారు.

ఇప్పుడు భారతదేశంలో డెబిట్ కార్డ్ లేకుండా కూడా UPI పేమెంట్  సులభంగా చేయవచ్చు. దీని కోసం, బ్యాంక్ అకౌంట్  లింక్ చేయడం ద్వారా లేదా UPI యాప్‌లో ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్ ద్వారా UPI పేమెంట్స్ చేయవచ్చు. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్  ఉపయోగించడానికి, మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్ ఇంకా  బ్యాంక్ అకౌంటుకు లింక్ చేయాలి.

మీరు డెబిట్ కార్డ్ లేకుండా BHIM UPI యాప్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేయవచ్చ.
ఇందుకోసం ముందుగా BHIM UPI యాప్‌ని ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
దీని తర్వాత మీ ఫోన్ నంబర్‌తో లాగిన్ చేయండి. లాగిన్ అయిన తర్వాత అకౌంట్  సెటప్ చేయండి.
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్‌లో యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇక్కడ మీ బ్యాంక్  సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీ ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి, అందులో మీరు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీకు డెబిట్ కార్డ్ లేకపోతే, ఇచ్చిన ఆప్షన్‌లలో ఆధార్ కార్డ్ అప్షన్  సెలెక్ట్ చేసుకోండి.
దీని తర్వాత UPI నంబర్‌ను సెట్ చేయండి.
చివరగా మీ అకౌంట్  డెబిట్ కార్డ్ లేకుండా రెడీగా ఉంటుంది.

ఆధార్ కార్డ్ నుండి UPI పిన్‌ని జనరేట్ చేయడానికి, ఈ స్టెప్స్ పాటించండి
ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్  సెలెక్ట్ చేసుకోండి.
యాప్ ప్రకారం, UPI IDని క్రియేట్ చేయండి ఇంకా అది అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి.
'ఆధార్ ఆధారిత వెరిఫికేషన్' అప్షన్   సెలెక్ట్ చేసుకోండి, నిబంధనలు ఇంకా  షరతులను అంగీకరించండి.
ఆధార్ నంబర్‌లోని మొదటి 6 అంకెలను ఎంటర్  చేయడం ద్వారా వెరిఫై చేయండి అండ్ 'కన్ఫర్మ్'పై క్లిక్ చేయండి.

4 అంకెల UPI పిన్‌ని సెట్ చేయండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఎంటర్  చేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ముందు దశలో సెట్ చేసిన UPI పిన్‌ని ఎంటర్ చేసి, 'కన్ఫర్మ్'పై క్లిక్ చేయండి.
డెబిట్ కార్డ్ లేకుండా కూడా Google Payలో UPI అకౌంట్  సెటప్ చేయవచ్చు. ఇందుకోసం కస్టమర్ ఆధార్ నంబర్ సరిపోతుంది. UPI అనేది డిజిటల్ పేమెంట్లకు చాలా సులభమైన పద్ధతి.


UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్)తో ఎన్నో ప్రయోజనాలు
మీరు UPI ద్వారా డబ్బు పంపవచ్చు ఇంకా  పొందవచ్చు.
మీరు ఇన్స్టంట్  బిల్లు చెల్లించవచ్చు.
మీరు అదే అప్లికేషన్‌లో లావాదేవీలను ఆథరైజేషన్ చేయవచ్చు .
ఇంటర్-బ్యాంక్, పర్సన్-టు-మర్చంట్ అండ్  పీర్-టు-పీర్ లావాదేవీలు UPI ద్వారా సులభంగా చేయవచ్చు.
మీరు ఫోన్ నంబర్ ద్వారా మాత్రమే ఏదైనా యాప్  UPI IDకి డబ్బు పంపవచ్చు
మీరు UPIతో మీ ప్రత్యామ్నాయ అకౌంట్  కనెక్ట్ చేస్తే, మీ ప్రైమరీ  అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉంటుంది. మీరు దానిపై సంవత్సరానికి 7 శాతం వడ్డీని పొందుతారు.

అయితే, UPIకి కొన్ని ప్రతికూలతలు(disadvantages) కూడా ఉన్నాయి
UPI లావాదేవీల సంఖ్య, ప్రతి లావాదేవీ మొత్తం రెండింటిపై పరిమితులను విధిస్తుంది.
మీరు ఒకటి కంటే ఎక్కువ UPI IDలను ఉపయోగిస్తే, గందరగోళం పెరగవచ్చు.
మీరు ఏదైనా యాప్‌ను అప్‌డేట్ చేయకపోతే, సైబర్ మోసాల ప్రమాదం పెరుగుతుంది.
మీరు క్రెడిట్ కార్డ్‌ని UPIకి లింక్ చేస్తే, మీరు వ్యాపారుల నుండి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను చెల్లించాలి.
క్రెడిట్ కార్డ్‌ని UPIకి లింక్ చేయడం వలన మీరు లోన్‌లో చిక్కుకునే ప్రమాదం ఉంది.

click me!