సమ్మర్ కూల్ న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు.. ప్రయాణికులకు పండగే...

By Ashok kumar SandraFirst Published Apr 29, 2024, 3:24 PM IST
Highlights

విమానయాన సంస్థలు అందించే సేవలకు సంబంధించి ఛార్జీల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనల వల్ల విమాన టిక్కెట్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.

గత కొద్దీ నెలలుగా  కొత్త విమానయాన సంస్థల ఎంట్రీతో  విమాన టిక్కెట్ చార్జీలు కొంతమేర తగ్గాయి. దీనికి కారణం ఈ రంగంలో పెరిగిన పోటీ. అయితే విమాన టిక్కెట్ ధరలను మరింత తగ్గిస్తూ 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)' కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలు అందించే సేవలకు సంబంధించి ఛార్జీల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనల వల్ల విమాన టిక్కెట్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. అయితే ఈ కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

DGCA తాజా నిబంధనల ప్రకారం, విమానయాన సంస్థలు కొన్ని సేవలకు విడిగా ఛార్జీ విధించవచ్చు. కానీ ఆ సేవలు (బండిల్ చేయని సేవలు) ప్రయాణికులకు అప్షనల్(opt-in) ప్రాతిపదికన మాత్రమే అందించాలి. అంటే, ప్రయాణికులు తమకు కావలసిన సేవలను మాత్రమే సెలెక్టక్ చేసుకొని చెల్లించవచ్చు. అలాగే అన్ని సేవలను తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ప్రయాణికులకు డబ్బు ఆదా అవుతుంది.

లగేజ్ క్యారేజ్, ప్రిఫరెన్షియల్ సీటింగ్, మీల్స్/స్నాక్స్/డ్రింక్స్, మ్యూజికల్  ఇన్స్ట్రుమెంట్  కోసం విమానయాన సంస్థలు విడిగా ఛార్జీ విధించవచ్చు. ఈ సేవలను విమానయాన సంస్థలు టిక్కెట్ ఛార్జీలలో అప్షనల్  సేవలుగా మాత్రమే అందించాలి.


ఆప్ట్-ఇన్, ఆప్ట్-ఔట్ అంటే?

విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలలో ట్రావెల్  ఇన్సూరెన్స్ లేదా సీటు సెలక్షన్ వంటి కొన్ని ఎక్స్‌ట్రా సర్వీసెస్ లేదా ఛార్జీలను ఆటోమేటిక్‌గా యాడ్ చేస్తాయి. వీటిని ఆప్ట్-అవుట్ చేసుకోవచ్చు. వాటిని  వద్దనుకున్నా  కూడా ఛార్జీలు చెల్లించుకోక తప్పదు. ఆప్ట్-ఇన్ అంటే.. టికెట్ బుక్ చేసేటప్పుడు కావాల్సిన ఎక్స్‌ట్రా సర్వీసులు లేదా ఫీచర్లను మ్యానువల్‌గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 ప్రయాణికుల నుంచి అందిన అభిప్రాయాల ఆధారంగా, చాలా సందర్భాల్లో ఆప్ట్-ఇన్ సర్వీస్‌లు ప్యాసింజర్లకు అవసరం లేదని తెలిసింది. ఎయిర్‌లైన్స్‌ అందించే ఈ సేవలను వేరు చేసి, వాటికి ఆప్షనల్ ఆధారంగా ఛార్జీలు విధించడం ద్వారా, ప్రైమరీ  టికెట్ ధర తక్కువగా ఉండే అవకాశముంది.” అని DGCA ఒక ప్రకటనలో చెప్పింది. 

ఆ ఛార్జీలు ఏవో చూద్దాం...
 - విమానంలో ముందు భాగంలో లేదా ఎక్కువ లెగ్‌రూమ్ ఉన్న ప్రిఫరెన్షియల్ సీట్ల కోసం ఛార్జీలు

- ఎయిర్‌లైన్స్‌ అందించే మీల్స్/స్నాక్స్/డ్రింక్స్‌ (కూల్ వాటర్ మినహాయింపు)

- ఎయిర్‌లైన్ లాంజ్‌లు ఉపయోగించినందుకు ఛార్జీలు

- బ్యాగేజీ కోసం ప్రత్యేక ఫీజు (విమానయాన సంస్థ బాధ్యత పెంచడానికి)

- బ్యాగేజీ ఛార్జీలు

* ఛార్జీల మార్పులలో జాగ్రత్తలు

తాజా నిబంధనల ప్రకారం సంస్థలు సేవల గురించి స్పష్టంగా వివరించాలి. ప్రయాణికులు ఏ సేవలు కావాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు సమాచారం ఉండాలి. టికెట్ బుక్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకునే  సేవలకు మాత్రమే డబ్బు వసూలు చేయాలి. క్రీడాకారులు, కళాకారులకు ప్రత్యేక రాయితీలు ఉండొచ్చు. ప్రతి సేవకు ఛార్జీలు స్థిరంగా ఉంటాయి. సంస్థలు 30 రోజుల ముందుగా మార్పులు తెలియజేయాలి. వెబ్‌సైట్‌లో సర్వీసులు, ఛార్జీల వివరాలు స్పష్టంగా చూపించాలి. ఆప్ట్-ఇన్ సేవలు ఎంచుకోకుండా టికెట్ బుక్ చేసుకునే వీలు ఉందని తెలియజేయాలి. ట్రావెల్ ఏజెంట్లు కూడా ఈ సమాచారం చూపించాలి.


దివ్యాంగులకు వీల్ కుర్చీ వంటి సహాయం అందించడంలో వివక్షత ఉండకూడదు. ముందుగా చెల్లించిన సర్వీస్  అందించకపోతే డబ్బు తిరిగి చెల్లించాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సీట్లు కేటాయించాలని DGCA విమానయాన సంస్థలను ఆదేశించింది.

click me!