ఏషియన్ గేమ్స్: భారత్ కు అత్యధిక పతకాలు ఖాయం, సంబరాలకు సిద్దం కండి : గోపిచంద్

By Arun Kumar PFirst Published Aug 14, 2018, 4:06 PM IST
Highlights

ఈ నెల 18 నుండి జరగనున్న ఏషియన్ గేమ్స్ 2018 లో భారత్ పతకాల పంట పండిచడం ఖాయమని అన్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్. అన్ని విభాగాల్లోనూ భారత్ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎక్కువ పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ లో ఒకే ఒక్క పథకం వచ్చిందని గుర్తు చేసిన ఆయన...ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. ప్రతి క్రీడాకారులు తమ సత్తా పెంచుకుని అన్ని విభాగాల్లో పతకాలు సాధించడానికి సిద్దమయ్యారని అన్నారు.
 
ఇవాళ పీడిఎల్ స్పోర్ట్స్ లైవ్ అనే సంస్థ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో గోపిచంద్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు వెళ్లనున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ...ఈ ఏడాది జరిగిన ప్రతి టోర్నీలోను మన బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్తా చాటారని ఆయన తెలిపారు. ముఖ్యంగా డబుల్స్ లో మన క్రీడాకారులు మరింత బాగా రాణిస్తున్నారని అన్నారు. ఈసారి పతకాల సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తోందని, క్రీడాభిమానులు సంబరాలకు సిద్దంగా ఉండాలని గోపీచంద్ తెలిపారు.

ఇక బ్యాడ్మింటన్ స్టార్ సింధు మాట్లాడుతూ... ''ప్రస్తుతం క్రీడాకారులమంతా మంచి ఫామ్ లో ఉన్నాం. ఇలాంటి సమయంలో ఏషియన్ గేమ్స్ రావడం మనకు కలిసొచ్చే విషయం. అందరం మన అత్యుత్తమ ఆటతీరు కనబర్చి పతకాలు సాధించాలని కోరుకుంటున్నా. భారత ప్రజలు మనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుందాం'' అని అన్నారు. 

click me!