మరో అరుదైన రికార్డును సాధించిన కెప్టెన్ విరాట్

First Published Jul 13, 2018, 4:24 PM IST
Highlights

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కాదు కెప్టెన్ గా కూడా అత్యుత్తమంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా విరాట్ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.  గురువారం ఇంగ్లాండ్ తో భారత జట్టు ఆడిన వన్డే మ్యాచ్ కోహ్లీ కెప్టెన్సీలో 50వది కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ ద్వారా వన్డేలోనూ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు.

ఇప్పటివరకు 50 వన్డేలను కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన టీం ఇండియా 39 విజయాలను సాధించింది. కేవలం 11 మ్యాచుల్లో మాత్రమే ఓటమి చవిచూసింది. ఇలా మొదటి 50 వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన అంతర్జాతీయ కెప్టెన్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానాన్ని సంపాదించాడు. ఈ జాబితాలో ఇండియా నుండి మొదటిస్థానంలో నిలిచాడు. 41 విజయాలతో ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మొదటి స్థానంలో ఉండగా, 40 విజయాలతో వెస్టిండీస్‌ మాజీ సారథి క్లైవ్‌ లాయిడ్ రెండో స్థానంలో ఉన్నారు.

ఇదే ఇంగ్లాండ్ జట్టు ఇండియా పర్యటనలో బాగంగా ధోనీ నుండి పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు  కోహ్లీ తీసుకున్నారు. అదే ఇంగ్లాడ్ జట్టుపై కెప్టెన్ గా యాబై వన్డే మ్యాచ్ లను పూర్తి చేయడం విశేషం.
 
click me!