KL Rahul : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులోకి కేఎల్ రాహుల్ ను ఎందుకు తీసుకోలేదు?

By Mahesh Rajamoni  |  First Published Apr 30, 2024, 10:54 PM IST

T20 World Cup 2024 - KL Rahul : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ సహా 15 మందితో కూడిన భార‌త జ‌ట్టులో కేఎల్ రాహుల్ కు చోటుద‌క్క‌లేదు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
 


India T20 World Cup 2024 squad : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024  కోసం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) 15 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. అలాగే, మ‌రో న‌లుగురు ప్లేయ‌ర్ల‌ను రిజ‌ర్వులో ఉంచింది. కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాలు జ‌ట్టును న‌డిపించ‌నున్నారు. కింగ్ కోహ్లీకి కూడా జ‌ట్టులో స్థానం ల‌భించింది. అయితే, ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లను సెల‌క్ట‌ర్లు ఎంపిక  చేయ‌గా, వారిలో కేఎల్ రాహుల్ లేక‌పోవ‌డం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఇదే స‌మ‌యంలో కేఎల్ రాహుల్ అభిమానుల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

అయితే, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త జట్టును ప్రకటించినప్పుడు ఐపీఎల్ లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ గా ఉన్న‌ కేఎల్ రాహుల్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం పై విభిన్న అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. అయితే, జ‌ట్టులో స్థానం ద‌క్క‌క‌పోవ‌డం ఊహించనిది కాద‌ని కాదంటూ ప‌లువురు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. సుదీర్ఘ గాయం విరామం తర్వాత ఐపీఎల్‌లో ఆడిన కేఎల్ రాహుల్.. ఆరంభంలో నెమ్మ‌దిగ ఆడ‌టంపై మొదట్లో విమర్శలు వచ్చాయి. అయితే తొలి మ్యాచ్‌ల తర్వాత పవర్ ప్లేలో మెరుపులు మెరిపించే దిశ‌గా ప్ర‌య‌త్నాల‌ను అభిమానులు చూశారు.

Latest Videos

ఈ క్ర‌మంలోనే కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలో టీ20 క్రికెట్‌లో చాలా మార్పు వచ్చిందని, ఇంపాక్ట్ ప్లేయర్‌లు ఆడగలరని, వారు ప్రారంభంలో ధైర్యంగా ఆడగలరని బదులిచ్చారు. కానీ ప్రపంచకప్ జట్టు ఎంపికపై రాహుల్ కళ్లతో గత మ్యాచ్‌లను చితక్కొట్టినట్లు స్పష్టమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 48 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. త‌న ఇన్నింగ్స్ లో రెండు సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు.

రాహుల్ 48 బంతుల్లో 158.33 స్ట్రైక్ రేట్‌తో 76 పరుగులు చేశాడు, అయితే సీజన్ రన్ ఛేజ్‌ను పరిశీలిస్తే, రాహుల్ 9 గేమ్‌లలో 378 పరుగుల స్ట్రైక్ రేట్ 144.27 గా ఉంది. అయితే, ఇదే స‌మ‌యంలో కేఎల్ రాహుల్‌కు బదులుగా జట్టులో రెండో వికెట్ కీపర్‌గా తీసుకున్న సంజూ శాంస‌న్ స్ట్రైక్ రేట్ 161.09 గా ఉంది. ప్రధాన వికెట్ కీపర్‌గా భావిస్తున్న రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్ 158.57గా ఉంది. ఈ రెండు అంశాలు కేఎల్ రాహుల్ ను భార‌త వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టుకు దూరంగా ఉంచిన‌ట్టు తెలుస్తోంది. సంజూ, రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శనలతో అద‌ర‌గొడుతున్నారు. గాయం కార‌ణంగా 2022 తర్వాత భారత్ తరపున టీ20 క్రికెట్ ఆడకపోవడం రాహుల్ ప్రపంచ కప్ జట్టులోకి తీసుకునే విష‌యాన్ని ప్ర‌భావితం చేసిన‌ట్టు కూడా ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

T20 WC India Squad : స్టార్ ప్లేయర్లకు షాకిచ్చిన బీసీసీఐ.. టాప్-5 అన్‌లక్కీ ప్లేయ‌ర్లు వీరే..

click me!