ధోనీకి, కోహ్లీకి మధ్య తేడా ఇదే... గౌతమ్ గంభీర్ సెటైర్...

By team teluguFirst Published Sep 14, 2020, 4:16 PM IST
Highlights

కోహ్లీ... ఈ జట్టుతో టైటిల్ ఎలా గెలుస్తావ్?

జట్టు ఎంపికలో ప్లానింగ్ ఉండక్కర్లేదా!

విరాట్‌కు చురకలు అంటించిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ. సారథిగా ద్వైపాక్షిక సిరీసుల్లో అత్యధిక విజయాలు విరాట్ పేరిటే ఉన్నాయి. అయితే కీలకమైన ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతున్నట్టుగానే ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా ఫెయిల్ అవుతున్నాడు కోహ్లీ. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, 5412 పరుగులతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.

గత సీజన్‌లో వరుసగా ఆరు పరాజయాలతో టోర్నీని మొదలెట్టిన కోహ్లీ జట్టు, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది బెంగళూరు జట్టు. అయితే ఆర్‌సీబీ జట్టు యాజమాన్యంపై, కోహ్లీ కెప్టెన్సీపై సెటైర్లు వేశాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.

‘ధోనీ తన జట్టు సభ్యులపై నమ్మకం ఉంచుతాడు. ఒక మ్యాచ్‌లో ఫెయిలైనా ఆరేడు మ్యాచుల్లో అవకాశం ఇస్తాడు. కానీ కోహ్లీ అలా కాదు. ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయితే, తర్వాతి మ్యాచ్‌లో అతనికి అవకాశం ఉండదు. కోహ్లీకి, ధోనీకి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే...’ అంటూ కామెంట్ చేశాడు గంభీర్.

బెంగళూరు జట్టులో కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ తప్ప మరో స్టార్ బ్యాట్స్‌మెన్ లేడని చెప్పిన గంభీర్, జట్టును ఎలా ఎంపిక చేయాలో తెలియకపోవడంతో బెంగళూరు ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణమని అన్నాడు.

క్రిస్ గేల్, షేన్ వాట్సన్, స్టార్క్ వంటి ప్లేయర్లు ఉన్నప్పుడు కూడా ప్లేయర్లపై నమ్మకం ఉంచని కోహ్లీ, సరైన ఫినిషర్లు, కట్టుదిట్టమైన బౌలర్లు లేని ప్రస్తుత జట్టుతో టైటిల్ ఎలా గెలుస్తాడో చూడాలని ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంట్ చేశాడు.

click me!