ఒలింపిక్స్ కూ కరోనా బెడద.... ఆందోళనలో అథ్లెట్లు

By telugu teamFirst Published Feb 6, 2020, 5:35 AM IST
Highlights

ఒలింపిక్స్‌ సమీపిస్తున్న తరుణంలో ఈ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరో 6 నెలల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం అవనున్న విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్ పై కరొనా వైరస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా కరోనా వైరస్ మాత్రమే అనడంలో  ఎటువంటి సంశయం అవసరం లేదు. చైనా లోని వుహాన్ నగర కేంద్రంగా ప్రబలుతున్న ఈ వైరస్ ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా కోరలు చాస్తోంది. 

ఈ వైరస్‌ మహమ్మారీ రోజురోజుకూ విపరీతంగా విస్తరిస్తోంది. ప్రాణాంతక వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. చైనా నుంచి ఒక్కో దేశానికి కరోనా వైరస్‌ అతి వేగంగా వ్యాపిస్తోంది. 

Also read: కరోనా వైరస్ అంటే ఏమిటి.... ? ప్రపంచం ఎందుకు వణికిపోతుందంటే...

ఒలింపిక్స్‌ సమీపిస్తున్న తరుణంలో ఈ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరో 6 నెలల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం అవనున్న విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్ పై కరొనా వైరస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 

కరోనావైరస్‌ విజృంభణపై ఏకంగా టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీ సీఈవో ఆందోళన వ్యక్తం చేయడం, అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరొనా వైరస్  టోక్యో ఒలింపిక్స్‌ దిశగా విస్తరిస్తుందేమోనని తాము తీవ్రంగా కలత చెందుతున్నామని ఆయన పేర్కొన్నారు. 

కరొనా వైరస్‌కు త్వరలోనే విరుగుడు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ....  వైరస్‌కు వేగంగా తెరపడితేనే పారాలింపిక్స్‌, ఒలింపిక్స్‌ సాఫీగా నిర్వహించడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డాడు. 

ఒలింపిక్‌ విలేజ్ లో నివసించే 11,000 మంది అథ్లెట్లు వైరస్‌ భయం లేకుండా ధైర్యంగా ఉండగలిగే వాతావరణాన్ని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రయాణ నిషేధాజ్ఞాలతో  క్రీడాభిమానుల్లో ఆందోళన కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. 

Also read: ఒళ్ళు జలదరించే కరోనా ఫుడ్స్: వామ్మో.. మనం చైనాలో పుట్టలేదు!

ఒలింపిక్స్‌ నిర్వహణ ఏర్పాట్లపై ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) మాత్రం సంతృప్తి వ్యక్తం చేసిందని, సంబంధిత విభాగాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాయని నమ్మకం ఉందని, ఒలింపిక్స్‌ నిర్వహణపై ఎటువంటి అనుమానం లేదని  నిర్వహణ కమిటీ సీఈవో తొషిరో ముటో తెలిపారు. 

ఈ వైరస్ కి 2019 నోవెల్ కరోనా వైరస్ గా నామకరణం చేసిందిప్రపంచ ఆరోగ్య సంస్థ(2019 novel coronavirus (2019-nCoV)). దానర్థం ఇది కొత్త వైరస్ అని. ఎంత కొత్తదంటే...ఇంకా పేరు పెట్టలేనంత!

click me!