కోహ్లీకి సడెన్ సర్ ప్రైజ్.. అదిరిపోయింది

By ramya neerukondaFirst Published 1, Sep 2018, 11:10 AM IST
Highlights

 ఒక ప్లేటులో ఆరు వేల పరుగుల అంకె వేసి నాలుగు స్ట్రాబెర్రిస్‌తో పాటు రెండు పేస్ట్రీలు ఉంచి అందంగా అలంకరించి కోహ్లీకి అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్న కోహ్లీ ‘సౌతాంప్టన్‌లోని హార్బర్‌ హోటల్‌ సిబ్బంది అందించిన ఈ కానుక ఎంతో నచ్చింది’ అని పేర్కొన్నాడు.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఊహించని సర్ ప్రైజ్ ఒకటి అందుకున్నారు. అది కూడా తాను బస చేస్తున్న హోటల్ సిబ్బంది నుంచి.  విరాట్‌ కోహ్లీ తాజాగా టెస్టుల్లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్‌లో టీమిండియా బస చేస్తోన్న హోటల్ సిబ్బంది కోహ్లీకి చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 

 

 రెండో రోజు శుక్రవారం ఆట ముగించుకుని టీమిండియా ఆటగాళ్లు యథావిధిగా తాము బస చేసే హోటల్‌కు వచ్చారు. టెస్టుల్లో ఆరు వేల మైలురాయిని అందుకున్న కోహ్లీకి ఆ హోటల్‌ సిబ్బంది చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఒక ప్లేటులో ఆరు వేల పరుగుల అంకె వేసి నాలుగు స్ట్రాబెర్రిస్‌తో పాటు రెండు పేస్ట్రీలు ఉంచి అందంగా అలంకరించి కోహ్లీకి అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్న కోహ్లీ ‘సౌతాంప్టన్‌లోని హార్బర్‌ హోటల్‌ సిబ్బంది అందించిన ఈ కానుక ఎంతో నచ్చింది’ అని పేర్కొన్నాడు.

Last Updated 9, Sep 2018, 11:59 AM IST