మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

By pratap reddyFirst Published Jan 19, 2019, 7:51 AM IST
Highlights

చాహల్ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తొలి దెబ్బ కొట్టగా, 87 పరుగులు చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. ధోనీ భారత్ కు విజయాన్ని అందించడం వెనక ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ తప్పిదం ఉంది.

మెల్‌బోర్న్: భారత్ తో జరిగిన మూడో వన్డేలో మాక్స్ వెల్ ఆస్ట్రేలియా కొంపముంచాడు. మూడో టెస్టులో భారత్ విజయం సాధించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా విజయంలో బౌలర్ యుజ్వేంద్ర చాహల్, బ్యాటింగ్‌లో మహేంద్ర సింగ్  ధోనీ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించారు.

చాహల్ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తొలి దెబ్బ కొట్టగా, 87 పరుగులు చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. ధోనీ భారత్ కు విజయాన్ని అందించడం వెనక ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ తప్పిదం ఉంది.
 
స్టోయినిస్ వేసిన 16వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్ అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

స్టోయినిస్  వేసిన మూడో బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు తరలించాడు. అది  గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న మ్యాక్స్‌వెల్ ఆ క్యాచ్‌ను వదిలేసాడు.  తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన ధోనీ ఆ తర్వాత జాగ్రత్తగా ఆడాడు. అనవసరమైన షాట్లకు  వెళ్లకుండా చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలిస్తూ స్కోరును పెంచుతూ వెళ్లాడు.  కేదార్ జాదవ్‌తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. 

సంబంధిత వార్తలు

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

click me!