ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

By Arun Kumar PFirst Published Jan 18, 2019, 7:36 PM IST
Highlights

మెల్ బోర్న్ వన్డేలో భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టుపై చెలరేగిపోయారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో కూడా రాణించి నిర్ణయాత్మక చివరి వన్డేలో జట్టును గెలిపించి వన్డే సీరిస్‌ కూడా భారత్ ఖాతాలో పడేలా చేశారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆసిస్ తమ స్వదేశంలో ఆడిన టెస్ట్, వన్డే సీరిస్ లను కోల్పోయి, టీ20 సీరిస్ ను సమం చేసింది. దీంతో ఆసిస్ రిక్తహస్తాలతో నిలిచి పరాభవం మూటగట్టుకుంది. 
 

మెల్ బోర్న్ వన్డేలో భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టుపై చెలరేగిపోయారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో కూడా రాణించి నిర్ణయాత్మక చివరి వన్డేలో జట్టును గెలిపించి వన్డే సీరిస్‌ కూడా భారత్ ఖాతాలో పడేలా చేశారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆసిస్ తమ స్వదేశంలో ఆడిన టెస్ట్, వన్డే సీరిస్ లను కోల్పోయి, టీ20 సీరిస్ ను సమం చేసింది. దీంతో ఆసిస్ రిక్తహస్తాలతో నిలిచి పరాభవం మూటగట్టుకుంది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టును ఏ దశలోనూ భారత బౌలర్లు కోలుకోనివ్వలేదు. ముఖ్యంగా స్పిన్నర్ చాహల్ ఈ మ్యాచ్ లో ఆసిస్ బౌలర్లను తన స్పిన్ మాయాజాలంతో ఉతికి ఆరేశాడు. ఈ  ఒక్క మ్యచ్ లోనే బరిలోకి దిగిన చాహల్  6 వికెట్లు పడగొట్టి 42 పరుగుల  సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి తట్టుకోలేక ఆస్ట్రేలియా  బ్యట్ మెన్స్ చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 230 పరుగులకే కుప్పకూలిపోయింది. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు కూడా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియా 113 పరుగుల వద్దే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. మొదటి, రెండో వన్డేలో సెంచరీలతో జట్టును చెలరేగిన రోహిత్,కోహ్లీలు  కూడా పెవిలియన్ కు చేరారు. ఆ సమయంలో అనూహ్యంగా నాలుగో స్థానంలో భరిలోకి దిగిన ధోని అద్భుతం చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేదార్ జాదవ్(57 బంతుల్లో 61 పరుగులు) తో కలిసి కీలక ఇన్నింగ్స్ నెలకొల్పి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 

ఇలా బౌలింగ్‌లో చాహల్,  బ్యాటింగ్ లో ధోని రాణించి ఆసిస్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. ఈ వన్డే విజయం ద్వారా భారత్ 2-1 తేడాతో వన్డే సిరిస్ ను కైవసం చేసుకోగా...చాహల్ మ్యాన్ ఆప్ ది మ్యాచ్, ధోని మ్యాన్ ఆప్ ది సిరిస్ అవార్డులు గెలుచుకున్నారు.  

సంబంధిత వార్తలు

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

click me!
Last Updated Jan 18, 2019, 7:36 PM IST
click me!