2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

By Arun Kumar PFirst Published Jan 18, 2019, 9:14 PM IST
Highlights

ఆస్ట్రేలియా జట్టుపై భారత్ సాధించిన వన్డే సీరిస్ విజయంలో మహేంద్ర సింగ్ ధోని కీలక పాత్ర పోషించాడు. అడిలైడ్, మెల్ బోర్న్ వన్డేల్లో చివరి వరకు నాటౌట్ గా నిలిచి కీలకమైన విన్సింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా 2019 ఆరంభంలో వరుస మ్యాచుల్లో చెలరేగిన ధోని విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు.  

ఆస్ట్రేలియా జట్టుపై భారత్ సాధించిన వన్డే సీరిస్ విజయంలో మహేంద్ర సింగ్ ధోని కీలక పాత్ర పోషించాడు. అడిలైడ్, మెల్ బోర్న్ వన్డేల్లో చివరి వరకు నాటౌట్ గా నిలిచి కీలకమైన విన్సింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా 2019 ఆరంభంలో వరుస మ్యాచుల్లో చెలరేగిన ధోని విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు.  

అయితే 2018 సంవత్సరం మాత్రం ధోనికి పీడకలను మిగల్చింది. ఈ సంవత్సరం మొత్తం ధోని అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చాడు. మ్యాచ్ పినిషింగ్ ఇన్నింగ్స్ ఆడటం కాదు కదా కనీస పరుగులు కూడా సాధించడంలో విఫలమయ్యాడు. ఈ సంవత్సరంలో  ధోని ఆడిన 20 వన్డేల్లో కేవలం 275పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మాజీలు, విశ్లేషకుల నుండే కాదు అభిమానుల నుండి కూడా ధోని తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఇలా ఈ సంవత్సరం మొత్తం వన్డేల్లో ఒక్క అర్థశతకం కూడా సాధించలేకపోయాడు. 

ఇక ధోని పని అయిపోందని అందరూ భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వన్డేల్లో 51, 55నాటౌట్,  87 నాటౌట్ పరుగులతో హ్యాట్రిక్ అర్థశతకాలు సాధించాడు. ఇలా  2019 ఆరంభంలోనే ధోని తన అత్యుత్తమ ప్రదర్శ కనబర్చాడు. మళ్లీ తనదైన మ్యాచ్ విన్నింగ్ షాట్లతో ఆకట్టుకుంటూ కొత్త సంవత్సరాన్ని ధోని మరింత కొత్తగా ఆరంభించాడు. 

చివరి వన్డేలో ధోని సాధించిన 87 పరుగులు జట్టు భారత్ విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి.  ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేదార్ జాదవ్(57 బంతుల్లో 61 పరుగులు) తో కలిసి కీలక ఇన్నింగ్స్ నెలకొల్పి ధోని భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 

సంబంధిత వార్తలు

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

click me!
Last Updated Jan 18, 2019, 9:16 PM IST
click me!