‘ విరాట్ కోహ్లీ చాలా డేంజర్’

By ramya neerukondaFirst Published Aug 17, 2018, 1:47 PM IST
Highlights

కోహ్లీ ఇప్పుడు చాలా డేంజర్. గత చరిత్రను పరిశీలిస్తే ఎంతో మంది ఆటగాళ్లు గాయం నుంచి కోలుకుని పరుగులు సాధించారు. వికెట్లు దక్కించుకున్నారు. 

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా డేంజర్ అని ఇంగ్లాండ్ జట్టు కోచ్ ట్రెవర్ బెలీస్ అన్నారు. భారత్-ఇంగ్లాండ్‌ మధ్య శనివారం మూడో టెస్టు ప్రారంభంకానుంది.

 ఈ నేపథ్యంలో బెలీస్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘గాయం నుంచి కోలుకున్న కోహ్లీ ఇప్పుడు చాలా డేంజర్. గత చరిత్రను పరిశీలిస్తే ఎంతో మంది ఆటగాళ్లు గాయం నుంచి కోలుకుని పరుగులు సాధించారు. వికెట్లు దక్కించుకున్నారు. ఇప్పుడు కోహ్లీ కూడా అంతే. గురువారం కోహ్లీ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఎలాంటి సమస్యలు లేకుండా స్లిప్‌ క్యాచ్‌లు పట్టాడు. దీనిబట్టి చూస్తే అతడు మూడో టెస్టులో ఆడతాడనే తెలుస్తోంది. అతడు ఆడినా ఆడకపోయినా మా గేమ్‌ ప్లాన్‌లో ఏమాత్రం మార్పులు ఉండవు. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానం కూడా లార్డ్స్‌ మాదిరిగానే ఉంది. బంతి స్వింగ్‌ అవుతుందనే అనుకుంటున్నా’ అని బెలీస్‌ తెలిపాడు.

click me!