యువరాజ్ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ

By telugu teamFirst Published Aug 14, 2019, 9:56 AM IST
Highlights

భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఏడో స్థానంలో ఉన్నాడు. కాగా... ఇప్పుడు ఆ రికార్డుకి చేరువలో రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ శర్మ.. యూవీ రికార్డుని బ్రేక్ చేయడానికి కేవలం 26 పరుగులే అవసరం.

టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డుపై ఇప్పుడు టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కన్నుపడింది. భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఏడో స్థానంలో ఉన్నాడు. కాగా... ఇప్పుడు ఆ రికార్డుకి చేరువలో రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ శర్మ.. యూవీ రికార్డుని బ్రేక్ చేయడానికి కేవలం 26 పరుగులే అవసరం.

యువరాజ్ 304 వన్డేల్లో 8701 పరుగులు చేయగా... రోహిత్ శర్మ మాత్రం కేవలం 217 మ్యాచుల్లో 8676 పరుగులు సాధించాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్‌ రికార్డు స్థాయిలో ఐదు శతకాలతో 648 పరుగులు బాదాడు. కానీ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో నిరాశపరిచాడు. 34 బంతుల్లో 18 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనగా రోహిత్‌ కాస్త తడబడ్డాడు. మూడో వన్డేలో హిట్‌మ్యాన్‌ తనదైన శైలిలో రాణించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు: సచిన్‌ తెందుల్కర్‌ (18426), విరాట్ కోహ్లీ (11406), సౌరభ్‌ గంగూలీ (11363), రాహుల్‌ ద్రవిడ్‌ (10889), ఎంఎస్ ధోనీ (10773), మహ్మద్‌ అజారుద్దీన్‌ (9378), యువరాజ్‌ సింగ్ (8701), రోహిత్‌ శర్మ (8676).

click me!