టీమిండియా కెప్టెన్ కోహ్లీతో హైదరబాదీ షట్లర్ పోటీ

By Arun Kumar PFirst Published Feb 9, 2019, 8:28 AM IST
Highlights

భారత దేశంలో క్రికెటర్లకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. వారిని దేవుళ్లుగా భావించే అభిమానులు, క్రికెట్ మ్యాచ్ లను ఎగబడి చూసే జనాలున్న ఈ  దేశంలో క్రికెటర్లు రెండు చేతులా సంపాదించడం పెద్ద విషయం కాదు. అలాంటిది క్రికెట్ రికార్డులను బద్దలుగొడుతూ దూసుకుపోతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ఆటగాడి ఆదాయం గురించి  చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఆదరనే క్రీడా విభాగం బ్యాడ్మింటన్ లో రాణించిన ఓ మహిళా క్రీడాకారిణి ఏకంగా ఆదాయంలో కోహ్లీలో పోటీ పడుతోంది. ఆమె ఎవరో  కాదు మన హైదరబాదీ  షట్లర్ పివి.సింధు. 

చైనాకు చెందిన క్రీడా పరికరాల తయారీ సంస్థ లి నింగ్‌ పి సింధుతో ఓ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నాలుగేళ్ల కాలానికి ఏకంగా రూ.50 కోట్లతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది జాతీయ స్థాయిలోనే  కాదు అంతర్జాతీయ స్థాయిలో ఓ షట్లర్ కుదుర్చుకున్న అతి పెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటి. 

ఈ భారీ ఒప్పందంతో క్రీడాకారుల ఆర్జన విషయంలో సింధు భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లీతో ఫోటీ పడుతోంది. కోహ్లీ 2017లో క్రీడా వస్తువుల తయారీ సంస్థ ప్యూమా సంస్థతో ఎనిమిదేళ్ల  కాలానికి రూ.100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ అతిపెద్ద ఒప్పందాలతో కోహ్లీ, సింధులు ఏడాదికి రూ.12.5 కోట్లు అందుకోనున్నారు.
 
ఇలా అత్యధిక ఆదాయం కలిగిన క్రికెటర్ కోహ్లీ తో సింధు పోటీ పడటం చాలా గొప్ప విషయమని బ్యాడ్మింటన్ క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ వుందో ఈ ఒప్పందమే తెలియజేస్తుందని...భారత్ లో కూడా బ్యాడ్మింటన్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందనికి ఈ ఒప్పందమే నిదర్శనమని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

click me!