అనుచిత వ్యాఖ్యలు: హార్డిక్ పాండ్యాకు మరో దెబ్బ

By pratap reddyFirst Published Jan 12, 2019, 5:39 PM IST
Highlights

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్ హార్జిక్ పాండ్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ టీవీ ఛానెల్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడితో పాటు మరో ఆటగాడు కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. 

ముంబై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్ హార్జిక్ పాండ్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ టీవీ ఛానెల్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడితో పాటు మరో ఆటగాడు కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. 

వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్న పలు ప్రముఖ బ్రాండ్లు, సంస్థలు తమ ఒప్పందాలను రద్దు చేసుకోవాలనే ఆలోచనలో పడ్డాయి.కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో పాండ్యా నిలకడగా రాణించడంతో అతనితో తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి కొన్ని కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయి. 

ఈ క్రమంలోనే జిల్లెట్ సంస్థ హార్దిక్‌తో కొన్ని నెలల క్రితం ఒప్పందం చేసుకుంది. మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అతనితో భాగస్వామ్యాన్ని తెంచుకున్నట్లు జిల్లెట్ ప్రకటించింది. జిల్లెట్ బ్రాండ్ అంబాసిడర్ గా పాండ్యాను తప్పిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

హార్దిక్ పాండ్యా ఎవరు..? ఈషా గుప్త ఫైర్

వారిద్దరూ ఉంటే నా భార్యాకూతుళ్లతో... భజ్జీ సంచలన వ్యాఖ్యలు

ద్రవిడ్ యువతిని ఎలా కన్విన్స్ చేశాడో చూడు...పాండ్యాపై నెటిజన్ల క్లాస్

ఆసిస్ తో వన్డే మ్యాచ్.. ఆ ఇద్దరూ దూరం

పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

click me!