రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

By pratap reddyFirst Published Jan 12, 2019, 5:09 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా అస్ట్రేలియా గడ్డపై రెండు సెంచరీలు చేసినవారు మరో ఎనిమిది ఉన్నారు. వారితో పాటు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. తొలి వన్డే మ్యాచులో విరాట్ కోహ్లీ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్న విషయం తెలిసిందే. 

సిడ్నీ: భారత బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ వివ్ రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేశాడు. సిడ్నీ క్రికెట్ మైదానంలో శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచులో రోహిత్ శర్మ 129 బంతుల్లో 133 పరుగులు చేయడం ద్వారా  వన్డేల్లో 22వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

అదే సమయంలో ఆస్ట్రేలియా గడ్డపై నాలుగో సెంచరీ నమోదు చేయడం ద్వారా రిచర్డ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. అస్ట్రేలియా గడ్డపై రిచర్డ్స్ మూడు సెంచరీలు చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు చేశాడు. 

ప్రపంచవ్యాప్తంగా అస్ట్రేలియా గడ్డపై రెండు సెంచరీలు చేసినవారు మరో ఎనిమిది ఉన్నారు. వారితో పాటు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. తొలి వన్డే మ్యాచులో విరాట్ కోహ్లీ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్న విషయం తెలిసిందే. 

ఆస్ట్రేలియా భారత్ ముిందు 289 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ మ్యాచులో రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేశారు. చివరకు భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా మూడు వన్డే మ్యాచులో సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 స్కోరుతో ముందంజలో ఉంది.

సంబంధిత వార్తలు

సచిన్ తర్వాత ఆస్థానం.. రోహిత్ శర్మదే..

సిడ్నీ వన్డే: రోహిత్ సెంచరీ వృధా...34 పరుగుల తేడాతో భారత్ ఓటమి

click me!