వరల్డ్ నెంబర్ 2 ఛాంపియన్ మన నీరజ్ చోప్రా..!

By telugu news teamFirst Published Aug 12, 2021, 12:13 PM IST
Highlights

అత‌డు ఏకంగా 14 స్థానాలు ఎగ‌బాక‌డం విశేషం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అత‌డు 16వ స్థానంలో ఉన్నాడు.

ఒలంపిక్స్ లో భారత్ స్వర్ణం కల నెరవేరింది. దాదాపు 100ఏళ్లకు పైగా స్వర్ణం కోసం ఎదురు చూస్తుండగా... నీరజ్ చోప్రా రూపంలో అది నిజమైంది. టోక్యో ఒలంపిక్స్ లో ఇటీవల జావెలన్ స్టార్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. కాగా తొలి గోల్డ్ మెడ‌ల్ సాధించి పెట్టిన జావెలిన్ స్టార్ నీర‌జ్ చోప్రా ( Neeraj Chopra ) తాజా వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరాడు. 

అత‌డు ఏకంగా 14 స్థానాలు ఎగ‌బాక‌డం విశేషం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అత‌డు 16వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించ‌డం నీర‌జ్ కెరీర్‌నే మార్చేసింది. ఫైన‌ల్లో 87.58 మీట‌ర్ల దూరం జావెలిన్ విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత దూరంలో నిలిచాడు.

ప్ర‌స్తుత ర్యాంకింగ్స్‌లో నీర‌జ్ 1315 పాయింట్ల‌తో జ‌ర్మ‌నీ స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ జోహ‌నెస్ వెట‌ర్ త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. వెట‌ర్ 1396 పాయింట్ల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఏడుసార్లు 90 మీట‌ర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన వెట‌ర్‌.. ఒలింపిక్స్ ఫైన‌ల్లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు... 

click me!