సెలక్టర్స్ మైండ్ లో ఏముంటుందో తెలీదు.. సచిన్

By ramya neerukondaFirst Published Nov 2, 2018, 2:14 PM IST
Highlights

ధోనిని టీ20 మ్యాచ్ లకు సెలక్ట్ చేయకపోవడంతో సెలక్టర్లపై ధోనీ అభిమానులు మండిపడిన సంగతి తెలిసిందే.

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని త్వరలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తో జరగబోయే టీ20 మ్యాచ్ లకు సెలక్ట్ చేయని సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై తొలిసారిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందించారు.

ధోనిని టీ20 మ్యాచ్ లకు సెలక్ట్ చేయకపోవడంతో సెలక్టర్లపై ధోనీ అభిమానులు మండిపడిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై సచిన్ మాట్లాడుతూ  సెలక్టర్స్ మైండ్ లో ఏముంటుందో ఎవరికీ తెలియదన్నారు.సెలక్టర్లు కూడా దేశం గురించి ఆలోచించే జట్టును ఎంపిక చేస్తారని సచిన్ అభిప్రాయపడ్డారు. 

అనంతరం ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గురించి మాట్లాడుతూ..కీలక ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ లేనందున ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలిచేందుకు ఈసారి టీమిండియాకు గొప్ప అవకాశం వచ్చిందని మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండుల్కర్‌ అన్నారు. స్మిత్, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేత గురించి స్పందించేందుకు అతడు నిరాకరించాడు. యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఆకట్టుకుంటున్నాడని, భారత పేస్‌ బౌలింగ్‌లో బుమ్రా కీలకమని పేర్కొన్న సచిన్‌... ఇలాంటి ఆరోగ్యకర పోటీ ఆహ్వానించదగినదని అన్నాడు.

ఒక క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లి పురోగతి అద్వితీయమని, అతడిలో ఆ కసిని తాను చూశానని పేర్కొన్నాడు. ‘విరాట్‌ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలుస్తాడని నేను అంచనా వేశా. అతడు ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా అవతరిస్తాడు. ఇక్కడ బౌలర్ల స్థాయి ఏమిటనేది అప్రస్తుతం. తరానికి తరానికి మార్పు తప్పనిసరిగా ఉంటుంది. అందుకని పోల్చి చూడటాన్ని నేను నమ్మను. యువ ఆటగాడు పృథ్వీ షా మరింతగా వెలుగులోకి వచ్చేందుకు ఆస్ట్రేలియా పర్యటన ఉపయోగపడుతుంది’ అని సచిన్‌ విశ్లేషించాడు. 

read more news

రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ

click me!