పీవీ సింధుకి మరోసారి నిరాశే... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఓడిన తెలుగు షెట్లర్...

By Chinthakindhi RamuFirst Published Dec 5, 2021, 2:16 PM IST
Highlights

BWF World tour finals:  కొరియన్ షెట్లర్ అన్ సియాంగ్ చేతుల్లో 16-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడిన పీవీ సింధు... వరుసగా మూడో టోర్నీలోనూ నిరాశే..

తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మరోసారి టైటిల్‌కి అడుగు దూరంలో నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో కొరియన్ షెట్లర్ అన్ సియాంగ్ చేతుల్లో 16-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడింది పీవీ సింధు. సియాంగ్ చేతుల్లో పీవీ సింధు ఓడిపోవడం ఇది మూడోసారి. ఇంతవరకూ ఈ కొరియన్ షెట్లర్‌పై విజయం అందుకోలేకపోయింది పీవీ సింధు...

అయితే రన్నరప్‌గా నిలిచిన పీవీ సింధు, 10,200 పాయింట్లతో పాటు 60 వేల డాలర్లు (దాదాపు 45 లక్షల 15 వేల రూపాయలు) బహుమతిగా అందుకోనుంది. అంతకుముందు శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ వుమెన్ సింగిల్స్ సెమీ ఫైనల్స్ పీవీ సింధు, జపాన్ ప్లేయర్ వరల్డ్ మూడో ర్యాంకర్ యమగూచిని ఓడించింది...

ఇదీ చదవండి: ఆర్‌సీబీ కోచ్‌గా ఏబీ డివిల్లియర్స్... విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ 2022 సీజన్‌లో...

దాదాపు గంటా 10 నిమిషాల పాటు సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధు 21-15, 15-21, 21-19 తేడాతో గెలిచి, ఫైనల్‌కి దూసుకెళ్లింది. టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత పీవీ సింధుకి వరుసగా ఇది మూడో టోర్నీ. ఇంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేషియా మాస్టర్స్, డెన్మార్క్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌లో ఓడింది పీవీ సింధు...

ఓవరాల్‌గా ఈ ఏడాది పీవీ సింధు మెరుగైన ప్రదర్శనే ఇచ్చింది. 18 నెలల విరామం తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది ఆరంభంలో స్విస్ ఓపెన్ ఫైనల్‌కి చేరిన పీవీ సింధు, ఆ తర్వాత ఆల్‌ ఇంగ్లాండ్ ఓపెన్‌లోనూ సెమీ ఫైనల్‌కి ప్రవేశించింది. స్విస్ ఓపెన్‌తో పాటు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన పీవీ సింధు, ఈ ఏడాది 22 సింగిల్స్ మ్యాచులు ఆడితే, అందులో 15 విజయాలు అందుకుంది. ఏడు మ్యాచుల్లో పరాజయం పాలైంది...

డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నోలో క్వార్టర్ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టింది పీవీ సింధు. అక్టోబర్‌లో జరిగిన ఈ టోర్నీలో కూడా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, అన్ సియాంగ్ చేతుల్లోనే ఓడడం విశేషం. 

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పీవీ సింధు, జీవితకథలో పెద్దగా చెప్పుకోదగిన మలుపులేమీ ఉండవు. అయితే బ్యాడ్మింటన్ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆమె పడిన మానసిక సంఘర్షణ, ప్రాక్టీస్, ప్రపంచ ఛాంపియన్‌లపై ఆమె సాధించిన విజయాలతో బయోపిక్ తీయాలని బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి... 

Read also: టీ20 వరల్డ్‌ కప్‌లో అందుకే ఓడిపోయాం... భారత జట్టు ప్రదర్శనపై సౌరవ్ గంగూలీ కామెంట్స్...

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు, 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి... ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసింది...

ఒలింపిక్ మెడల్స్‌తో పాటు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఏసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఇలా భారత్‌కి పతకాల పంట పండించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు...

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, తన స్నేహితురాలు పీవీ సింధు బయోపిక్‌లో నటించాలని తెగ ఆసక్తిగా ఉంది. నటిగానే కాకుండా... పీవీ సింధు బయోపిక్‌ని నిర్మించాలని కూడా దీపికా పదుకొనే ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం...

click me!