క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన స్టార్ ఆల్‌రౌండర్ మోర్కెల్

By sivanagaprasad kodatiFirst Published Jan 10, 2019, 7:39 AM IST
Highlights

దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్, ప్రపంచంలోని విధ్వంసక ఆటగాళ్లలో ఒకరైన ఆల్బీ మోర్కెల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. 

దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్, ప్రపంచంలోని విధ్వంసక ఆటగాళ్లలో ఒకరైన ఆల్బీ మోర్కెల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. 20 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్‌లో 1 టెస్ట్, 58 వన్డేలు, 50 టీ20లు ఆడారు. మోర్కెల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 1,412 రన్స్, 77 వికెట్లు సాధించాడు.

2004లో తొలి వన్డే ఆడిన మోర్కెల్ మొత్తం 58 వన్డేలలో 782 పరుగులు, 50 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మోర్కెల్‌కు ఐపీఎల్‌లో మెరిపించిన మెరుపులు అన్నీ ఇన్నీ కావు. చెన్నై తరపున 974 పరుగులు, 85 వికెట్లను తన ఖాతాలో వేసుకుని 2011లో చెన్నై సూపర్‌కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అన్ని టీ20లలో కలిపి 4,247 పరుగులు, 247 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

‘‘తనకు క్రికెట్ ఆడే వయసు అయిపోయిందని, అందుకే క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నాన్నాడు. 20 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో తీపి గుర్తులు, చేదు అనుభవాలు. క్రికెట్ సౌతాఫ్రికాకి ధన్యవాదాలు, నా ప్రయాణంలో అన్ని విధాలా సహకరించిన నా భార్యకు ధన్యవాదాలు అని మోర్కెల్ ట్వీట్ చేశాడు.

రిషబ్ పంత్‌పై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసిన బోనీపైన్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ...అదీ ఇండియాలో

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

పంత్ కి పెరిగిన డిమాండ్...బేబీ సిట్టర్ గా..

కోహ్లీ, పుజారాలకు వెస్టిండీస్ క్రికెటర్ స్పెషల్ మెసేజ్

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

ఊహాగానాలకు బ్రేక్... ఐపిఎల్2019పై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ

ట్రోఫీ అందుకున్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న గవాస్కర్

click me!