ఆసిస్ ని  సొంత గడ్డపై మరికరిపించి.. టెస్టు సిరీస్ ని సొంతం చేసుకుంది టీం ఇండియా. సోమవారం టీం ఇండియా సిడ్నీలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అందుకున్న సంగతి తెలిసిందే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ట్రోఫీని అందుకోవడం చూసి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

‘‘చాలా గర్వంగా ఉంది. ఈ చారిత్రక సన్నివేశాన్ని చూసిన తర్వాత భావోద్వేగానికి గురై.. ఏడ్చేశాను. ఇదొక గొప్ప రోజు కాబట్టి నేను అక్కడ ఉండి ట్రోఫీ అందిస్తే ఇంకా అద్భుతంగా ఉండేది. వారి గెలుపు, ట్రోఫీని అందుకోవడాన్ని చూడటం నిజంగా అద్భుతమైన ఫీలింగ్’’ అని సునీల్ గవాస్కర్ చెప్పారు.

అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ పేర్ల మీద ఏర్పాటు చేసిన ఈ ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ప్రతిసారి గవాస్కర్ హాజరౌతూ ఉంటారు. అయితే.. సిడ్నీలో  జరిగిన టెస్టుకి మాత్రం కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు. 

read more news

పేరేమో‘‘ బోర్డర్-గావస్కర్’’ ట్రోఫీ.. గావస్కర్‌ను పిలవని ఆసీస్ బోర్డ్