టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్ ఛటేశ్వర పేజారాలకు వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్.. స్పెషల్ మెసేజ్ చేశారు.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్ ఛటేశ్వర పేజారాలకు వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్.. స్పెషల్ మెసేజ్ చేశారు. ఇటీవల విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీం ఇండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో గావస్కర్ - బోర్డర్ సిరీస్‌ను భారత్ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
కాగా.. ఈ ఘటనపై వివ్ రిచర్డ్స్.. టీం ఇండియాకు అభినందనలు తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేశారు. ఈ విజయం సాధించిన టీం ఇండియా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవి శాస్త్రికి అభినందనలు తెలిపారు. టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శన కనపరిచిందంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
క్రికెటర్ పుజారా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనపరిచాడంటూ వివ్ రిచర్డ్స్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడన్నారు. అతనిలో రియల్ గోల్డ్ స్టఫ్ ఉదంటూ పేర్కొన్నాడు. ఈ మేరకు వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
